Sharad Pawar: ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియ, ప్రఫుల్ పటేల్
ABN , First Publish Date - 2023-06-10T14:13:00+05:30 IST
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే , ప్రఫుల్ పటేల్ ను ఆ పార్టీ సుప్రీం శరద్ పవార్ శనివారంనాడు ప్రకటించారు. పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవార్ ఈ నియామకాలు చేశారు. పవార్, పీఏ సంగ్మా కలిసి 1999లో ఎన్‌సీపీని స్థాపించారు.
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు (NCP Working presidents)గా సుప్రియా సూలే (Supriya Sule), ప్రఫుల్ పటేల్ (Praful Patel)ను ఆ పార్టీ సుప్రీం శరద్ పవార్ (Sharad Pawar) శనివారంనాడు ప్రకటించారు. పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవార్ ఈ నియామకాలు చేశారు. పవార్, పీఏ సంగ్మా కలిసి 1999లో ఎన్‌సీపీని స్థాపించారు.
ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, ఉమన్ యూత్, లోక్‌సభ సమన్వయకర్తగా సుప్రియా సూలే బాధ్యతలు నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా వ్యవహారాలను ప్రఫుల్ పటేల్ చూసుకుంటారు. శరద్ పవార్ గత నెలలో ఎన్‌సీపీ చీఫ్ పదవికి రాజీనామా ప్రకటించగా, పార్టీ కార్యకర్తలు ఆ ప్రతిపాదను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. పార్టీ ప్యానల్ మే 5న పవార్‌తో సంప్రదింపులు జరిపి పవార్ రాజీనామా ప్రతిపాదనను తోసిపుచ్చారు. దీంతో పవార్ ఆ ఆలోచనను వెనక్కి తీసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్లను ఏర్పాటు చేసుకోవాలని పవార్‌కు పార్టీ ప్యానల్ సూచించింది. ఈ నేపథ్యంలో పవార్ తాజా నియామకాలు చేపట్టారు. ఎన్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ టక్కరెకు ఒడిశా, పశ్చిమబెంగాల్, రైతులు, మైనారిటీ శాఖ బాధ్యతలు అప్పగించారు. నంద శాస్త్రిని ఢిల్లీ ఎన్‌సీపీ చీఫ్‌గా పవార్ ప్రకటించారు.
23న బిహార్‌లో విపక్షాల సమావేశం
విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని శరద్ పవార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. విపక్షాలన్నీ ఐక్యంగా ముందుకొస్తే ప్రజలు అండగా నిలబడతారని అన్నారు. ఈనెల 23న విపక్ష పార్టీల నేతలంతా బీహార్‌లో సమావేశమై ఒక ప్రోగ్రాం నిర్ణయిస్తారని, అనంతరం దేశవ్యాప్తంగా పర్యటించి ప్రచారం చేస్తారని చెప్పారు.