Sharad Pawar: విపక్ష నేతలతో పవార్ సమావేశం.. ఎజెండా ఏమిటంటే?

ABN , First Publish Date - 2023-03-22T18:15:06+05:30 IST

రాజ్యసభలో విపక్ష పార్టీల నేతలతో నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఢిల్లీలో సమావేశం..

Sharad Pawar: విపక్ష నేతలతో పవార్ సమావేశం.. ఎజెండా ఏమిటంటే?

న్యూఢిల్లీ: రాజ్యసభలో విపక్ష పార్టీల నేతలతో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. పవార్ నివాసంలో గురువారం సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. రూరల్ ఎలక్ర్టానిక్ ఓటింగ్ మిషన్లపై (EVM) ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

అన్ని విపక్ష పార్టీల నేతలకు ఇందుకు సంబంధించి పవార్ ఒక లేఖ రాశారు. రూరల్ ఓటింగ్ మిషన్ల సామర్థ్యంపై అనుమానాలున్న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని తాను ప్రతిపాదించినట్టు ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈవీఎంలపై పలువురు సామాజిక కార్యకర్తలు, రాజకీయ పార్టీలు వెలుబుచ్చిన అనుమానాలపై స్పందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల వాగ్దానం చేసిన నేపథ్యంలో పవార్ ఏర్పాటు చేసిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు, ప్రముఖ ఐటీ నిపుణులు, క్రిప్టోగ్రాఫర్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు పవార్ తెలిపారు. 2022 మేలో సివిల్ సొసైటీ ఒక లేఖను ఈసీఐకి సమర్పించింది. రెండు వారాల తర్వాత మరోసారి గుర్తు చేసింది. అయితే ఆ లేఖను ఈసీఐ ఇప్పటికీ గుర్తించలేదు. ఈవీఎంలను తారుమారు చేసేందుకు గల అవకాశాలపై సామాన్య ప్రజల్లో నెలకొన్న అనుమానాలు ఇప్పటికీ నివృత్తి కావడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి.

Updated Date - 2023-03-22T18:16:20+05:30 IST