Share News

Karnataka:రెండున్నరేళ్ల తరువాత డీకే శివకుమారే సీఎం.. దుమారం రేపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-10-28T10:34:39+05:30 IST

కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే(Congress MLA) చేసిన వ్యాఖ్యలు కన్నడ కాంగ్రెస్ లో తీవ్ర దుమారాన్ని రేపాయి. వివరాలు.. మాండ్యకు చెందిన ఎమ్మెల్యే రవికుమార్ గౌడ మాట్లాడుతూ.. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవికాలం పూర్తి చేసుకున్నాక.. తదుపరి రెండున్నరేళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పని చేస్తారని అన్నారు.

Karnataka:రెండున్నరేళ్ల తరువాత డీకే శివకుమారే సీఎం.. దుమారం రేపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

బెంగళూరు: కర్ణాటక(Karnataka) ఎన్నికల ఫలితాలు వచ్చాక ముఖ్యమంత్రి పీఠంపై సిద్ధరామయ్య(Siddaramaiah), డీకే శివకుమార్(DK Shivakumar)ల మధ్య పోటీ తప్పలేదు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం సిద్దరామయ్యకే సీఎం పీఠం అప్పగించి డీకేకు ఉప ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ కు సీఎం పదవి రాకపోవడంపై పలువురు కాంగ్రెస్ నేతలు గతంలో బాహాటంగానే అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే(Congress MLA) చేసిన వ్యాఖ్యలు కన్నడ కాంగ్రెస్ లో తీవ్ర దుమారాన్ని రేపాయి.


వివరాలు.. మాండ్యకు చెందిన ఎమ్మెల్యే రవికుమార్ గౌడ మాట్లాడుతూ.. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవికాలం పూర్తి చేసుకున్నాక.. తదుపరి రెండున్నరేళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పని చేస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన పార్టీకి ఎనలేని సేవ చేశారని.. సీఎం పీఠం ఆయనకు ఇవ్వడంలో తప్పే లేదని ఎమ్మెల్యే అన్నారు. అధికార మార్పిడిపై అధిష్టానం నిర్ణయం ఏంటో తనకు తెలియదని.. కానీ.. రాష్ట్ర అధ్యక్షుడిగా డీకే చేస్తున్న సేవలు మెచ్చి సీఎం పదవి తప్పక వరిస్తుందని అన్నారు. సిద్దరామయ్య రాజీనామా చేస్తారా అనే ప్రశ్నకు ఎమ్మెల్యే స్పందిస్తూ.. ఇలాంటి విషయాల గురించి ఇప్పుడెందుకు స్పందించాలని అన్నారు. ఈ అంశం ప్రస్తుతానికి అవసరం లేదని.. సిద్దరామయ్ సర్కార్ సమర్థవంతంగా పని చేస్తోందని ప్రశంసించారు. ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ దృష్టి పెట్టిందని.. టైం వచ్చినప్పుడు అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. పార్టీ అంతర్గత విషయాలపై ఎవరూ నోరుమెదపకూడదని డీకే శివకుమార్ గతంలోనే పార్టీ నేతలకు హెచ్చరించారు. అయినా ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యలు పార్టీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వివాదంపై సిద్దరామయ్య, ప్రతిపక్ష బీజేపీ(BJP) ఇంకా స్పందించలేదు.

Updated Date - 2023-10-28T10:35:15+05:30 IST