Karnataka CM race: సిద్ధరామయ్య, డీకే... సీఎం రేసులో ఎవరు ముందున్నారంటే..!

ABN , First Publish Date - 2023-05-13T17:53:55+05:30 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. 136 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ) విజయకేతనం ఎగురవేయగా, బీజేపీ 64 స్థానాలు గెలిచింది. కింగ్ మేకర్‌ అవుతుందని అనుకున్న జేడీఎస్ 20 స్థానాలకు పరిమితమైంది. దీంతో సీఎం పదవి ఎవరిని వరించనుందనేపైనే చర్చ మొదలైంది. సీఎం రేసులో సిద్ధరామయ్య ముందు వరుసలో ఉన్నారని, అధిష్ఠానం ఆశీస్సులు ఆయనకే ఎక్కువగా ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Karnataka CM race: సిద్ధరామయ్య, డీకే... సీఎం రేసులో ఎవరు ముందున్నారంటే..!

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. 136 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ (Congress) విజయకేతనం ఎగురవేయగా, బీజేపీ 64 స్థానాలు గెలిచింది. కింగ్ మేకర్‌ అవుతుందని అనుకున్న జేడీఎస్ 20 స్థానాలకు పరిమితమైంది. దీంతో సీఎం పదవి ఎవరిని వరించనుందనేపైనే చర్చ మొదలైంది. కర్ణాటక ఎన్నికల రేసులో మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) ఉన్నట్టు ఎన్నికల ప్రచార సమయంలోనూ బలంగా వినిపించినప్పటికీ ఆ నాయకులిద్దరూ సంయమనంతో వ్యవహరిస్తూ, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే తమ ఉమ్మడి లక్ష్యమని బలంగా సందేశమిచ్చారు. అందుకు తగ్గట్టే పార్టీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఇప్పడు సీఎం ఎవరనే దానిపై చర్చ షురూ అయింది. సీఎం రేసులో సిద్ధరామయ్య ముందు వరుసలో ఉన్నారని, అధిష్ఠానం ఆశీస్సులు ఆయనకే ఎక్కువగా ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఫలితాలు వెలువడగానే సిద్ధరామయ్యను ఆయన నివాసంలో డీకే కలుసుకోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

మోదీ, షా, ఖర్గేకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పు: సిద్ధరామయ్య

కాగా, కర్ణాటక కాంగ్రెస్ పనితీరు, సాధించిన విజయంపై సిద్ధరామయ్య స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అగ్రశ్రేణి నేతలు రాష్ట్రంలో జరిపిన పర్యటనల ప్రభావం కర్ణాటక ఓటర్ల ఏమాత్రం చూపలేదన్నారు. మోదీ, షా, ఖర్గేలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదని చెప్పారు. బీజేపీతో జనం విసిగెత్తిపోయారని, మోదీ, షా, నడ్డా రాష్ట్రానికి ఎన్నిసార్లు వచ్చినా ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండదని తాను మొదట్నించీ చెబుతూనే ఉన్నానని అన్నారు. రాష్ట్ర బీజేపీ అవినీతి, అసమర్ధ పాలన, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు విసిగెత్తిపోయి.. మార్పు కోరుకున్నారని, అందుకు అనుగుణంగానే తీర్పునిచ్చారని తెలిపారు.

రాహుల్‌ ప్రధాని కావాలని ఆశిస్తున్నా...

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు లోక్‌సభ ఎన్నికలకు 'స్టెప్పింగ్ స్టోన్' అని అభివర్ణించారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడిస్తాయని, రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు.

Updated Date - 2023-05-13T17:53:55+05:30 IST