Snow: నిష్క్రమించనున్న ఈశాన్య రుతుపవనాలు.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న మంచు
ABN , Publish Date - Dec 24 , 2023 | 01:05 PM
ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించనున్న నేపథ్యంలో, రాష్ట్రంలో మంచు(Snow) కురవడం అధికమైంది. కోయంబత్తూర్, నీలగిరి, ధర్మపురి, ఈరోడ్, కరూర్ పరమత్తి, మదురై, సేలం, తిరుత్తణి, వాల్పారై తదితర నగరాల్లో పగటి వేళల్లో కూడా చలి వాతావరణం నెలకొంది.
పెరంబూర్(చెన్నై): ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించనున్న నేపథ్యంలో, రాష్ట్రంలో మంచు(Snow) కురవడం అధికమైంది. కోయంబత్తూర్, నీలగిరి, ధర్మపురి, ఈరోడ్, కరూర్ పరమత్తి, మదురై, సేలం, తిరుత్తణి, వాల్పారై తదితర నగరాల్లో పగటి వేళల్లో కూడా చలి వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో కున్నూర్‌లో 11 డిగ్రీలు, కొడైకెనాల్, ఊటీ ప్రాంతాల్లో 9 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే, చెన్నై, చెంగల్పట్టు, కడలూరు, తిరుపత్తూర్, తిరుచ్చి, వేలూరు, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. తమిళనాడు, పుదుచ్చేరిలలో ఈనెల 28వ తేది వరకు అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది.