SP Ranjith Kumar: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-03-25T11:27:22+05:30 IST

రాష్ట్రంలో మే నెలలో జరిగే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసిందని,

SP Ranjith Kumar: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

బళ్లారి(బెంగళూరు): రాష్ట్రంలో మే నెలలో జరిగే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసిందని, ఎన్నికలు పటిష్టంగా, ఎన్నికల సమయంలో ఎలాం టి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేదుకు అవసరమైన పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రంజిత్‌ కుమార్‌ బండారు(SP Ranjith Kumar Bandaru) పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనంతపురం, కర్నూలు, విజయనగర, కొప్పళ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో 18 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 11 సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు కాగా, మిగిలినవి అంతర్‌ జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సరిహద్దు వాహనాల్లో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు 16కేసులు నమోదు కాగా, 6 లక్షల నగదు, 15 లక్షల చీరలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేరీతిలో మూడు కిలోల గాంజా, 600 లీటర్ల మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రూ 5లక్షలు విలువ చేసే గాంజాను స్వాధీనం చేసుకోగా, ఈ కేసుకు సంబంధించి దౌలా అనే వ్యక్తిపై కేసు నమోద అయిందని, నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో 769మంది రౌడీ షీటర్లను గుర్తించినట్లు, వారిలో 589మంది రౌడీ షీటర్లను బైండ్‌ఓవర్‌ చేసినట్లు, ఐదు మందిని సరిహద్దు బహిష్కరణకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఘర్షణలకు పాల్పడే 210మందిని గుర్తించి, వీరిలో 87మంది బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా జరిపేందుకు 60 సెక్టరల్‌ మొబైల్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. 25 సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్‌ బందోబస్తు పెంచామన్నారు. టాటాఏస్‌ వాహనంలో రవాణా చేస్తున్న 2200 చీరలను స్వాధీనం చేసుకున్నామని, అయితే ఏ పార్టీకి చెందినవనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు.

Updated Date - 2023-03-25T11:35:19+05:30 IST