Parliament Special session: నా జోస్యం ఫలిస్తోంది: నితీష్ కుమార్
ABN , First Publish Date - 2023-09-02T14:50:05+05:30 IST
లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయని తాను చెప్పినదే నిజమవుతోందని, అందుకు అనుగుణంగానే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు మోదీ ప్రభుత్వం పిలుపునిచ్చిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ముంబైలో రెండ్రోజుల 'ఇండియా' కూటమి సమావేశాలు ముగించుకుని పాట్నాకు వచ్చిన నితీష్ మీడియాతో మాట్లాడారు.
పాట్నా: లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయని తాను చెప్పినదే నిజమవుతోందని, అందుకు అనుగుణంగానే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు మోదీ ప్రభుత్వం పిలుపునిచ్చిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) అన్నారు. ముంబైలో రెండ్రోజుల పాటు జరిగిన 'ఇండియా' (INDIA) కూటమి సమావేశాలు ముగించుకుని పాట్నాకు వచ్చిన నితీష్ మీడియాతో మాట్లాడుతూ, ముందస్తు ఎన్నికలకు ఇది సంకేతమన్నారు. కొద్దికాలం నుంచి తాను లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయని చెబుతూనే ఉన్నానని గుర్తు చేశారు.
ఇటీవల వర్షాకాల సమావేశాల అనంతర పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడగా, సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం పిలుపునిచ్చింది. కాగా ''ఒక దశం ఒకేసారి ఎన్నికలు'' అంశంపై మాట్లాడేందుకు నితీష్ నిరాకరించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో తప్పనిసరిగా లేవనెత్తాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని చెప్పారు. కుల గణనపై ప్రభుత్వం తాత్కార వైఖరితో ఉందని, అసల ఆ విషయమే మరిచిపోయిందని అన్నారు. నిబంధనల ప్రకరాం ఎప్పుడో కులగణన పూర్తి కావాల్సి ఉండగా ఇంత వరకూ దానిని ప్రారంభించనే లేదని అన్నారు. అన్నింటికీ సమయం ఉంటుంది కానీ ఈ విషయంలో మాత్రం ప్రభుత్వానికి సమయం ఉండదని నితీష్ నిశిత విమర్శలు చేశారు.