Special train: బెంగళూరు మీదుగా కశ్మీర్‌కు ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2023-04-09T08:01:13+05:30 IST

భారత్‌ గౌరవ్‌ పథకంలో భాగంగా ఇండియన్‌ రైల్వే, ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్‌ సంస్థల సహకారంతో భూతల స్వర్గంగా భావించే

Special train: బెంగళూరు మీదుగా కశ్మీర్‌కు ప్రత్యేక రైలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): భారత్‌ గౌరవ్‌ పథకంలో భాగంగా ఇండియన్‌ రైల్వే, ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్‌ సంస్థల సహకారంతో భూతల స్వర్గంగా భావించే కశ్మీర్‌కు ప్రత్యేక వేసవి సెలవుల ప్యాకేజ్‌ రైలును నడపనుంది. ఈ మేరకు ట్రావెల్‌ టైమ్స్‌ సంస్థ నగరంలో శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. దక్షిణ స్టార్‌ రైల్‌ పేరిట ఈ ప్యాకేజ్‌ రైలు మే 11న కోయంబత్తూరు(Coimbatore) నుంచి ప్రారంభం కానుంది. ఇది ఈరోడ్‌, సేలం, ధర్మపురి, హోసూరు(Hosur), యలహంక, పెరంబూరు, వరంగల్‌ మీదుగా ప్రయాణిస్తుంది. ఈసేవలను పై స్టేషన్‌ల నుంచి అందుకునే సదుపాయం కల్పిస్తున్నారు. టికెట్‌ ధర, బీమా, భోజన వసతులు, పర్యాటక ప్రాంతాల వీక్షణ, స్థానిక రవాణా, ఇత్యాది సదుపాయాలన్నీ ప్యాకేజీలో ఉంటాయన్నారు. వీటికి ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభమైందని రైల్‌ టూరిజం డాట్‌కామ్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చునని ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక సదుపాయాలు ఉంటాయని, ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్‌టీసీ వెసులుబాటు ఉంటుందని, భారతీయ సంప్రదాయ భోజన సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. సీసీటీవీ(CCTV)తో భద్రత, ప్ర యాణిస్తున్న బోగీలలోనే తమ లగేజీని భద్రపరుచుకునే వెసులుబాటు కూడా ఉంటుందన్నారు. ఈ కశ్మీర్‌ యాత్ర మొత్తం 12 రోజులపాటు అందమైన ప్రదేశాల మీదుగా సాగుతుందన్నారు.

Updated Date - 2023-04-09T08:01:13+05:30 IST