Sonia Gandhi: రాజ్యసభకు సోనియాగాంధీ...? ఏ రాష్ట్రం నుంచంటే..

ABN , First Publish Date - 2023-07-24T17:45:25+05:30 IST

లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరం కావాలని భావిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత్రి సోనియాగాంధీ కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్‌ అవుతారని రెండుమూడు రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనారోగ్య కారణంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ పోటీ చేసే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేసుకోవాలని సీఎం సిద్దరామయ్య విన్నవించినట్టు తెలుస్తోంది.

Sonia Gandhi: రాజ్యసభకు సోనియాగాంధీ...? ఏ రాష్ట్రం నుంచంటే..

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరం కావాలని భావిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత్రి సోనియాగాంధీ కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్‌ అవుతారని రెండుమూడు రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనారోగ్య కారణంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ పోటీ చేసే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేసుకోవాలని సీఎం సిద్దరామయ్య విన్నవించినట్టు తెలుస్తోంది. కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సయ్యద్‌ నాసిర్‌ హుసేన్‌, డాక్టర్‌ ఎల్‌ హనుమంతయ్య, జీసీ చంద్రశేఖర్‌ వ్యవధి 2024 ఏప్రిల్‌ 2తో ముగియనుంది. రాష్ట్రంలో పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ముగ్గురు గెలుపొందేందుకు అవకాశం ఉంది.


సోనియాగాంధీతో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏఐసీసీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటి, కర్ణాటకకు చెందిన సయ్యద్‌ నాసిర్‌ హుసేన్‌ను రాజ్యసభకు మరోసారి ఎంపిక చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సోనియాగాంధీని కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలు కావాలని కోరినట్టు పార్టీ వర్గాల సమాచారం. ప్రతిపక్షాల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సోనియాగాంధీని భేటీ అయినవేళ సీఎం సిద్దరామయ్య ఈమేరకు ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఇక కేరళ రాష్ట్రం వయ్‌నాడ్‌ నుంచి ఎంపీగా ఎన్నికైన రాహుల్‌గాంధీ ఇటీవలే అనర్హుడైన విషయం తెలిసిందే.

Updated Date - 2023-07-24T17:45:28+05:30 IST