Home » Sonia Gandhi
నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈడీ, కాంగ్రెస్ నేతల సోనియా, రాహుల్‌గాంధీకి సంబంధించిన రూ. 661 కోట్ల స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడాన్ని ప్రారంభించింది
స్థిరాస్తుల జప్తునకు సంబంధించి మూడు ప్రాంతాల్లో నోటీసులు అతికించినట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని ఐటీవోలో ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ఏరియాలోని ప్రాంగణంలో, లక్నోలోని బిషేశ్వర్ నాథ్ రోడ్డులో ఉన్న ఏజేఎల్ బిల్డింగ్ వద్ద ఈ నోటీసులు అతికించినట్టు పేర్కొంది.
CWC Meetings: అహ్మదాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
ప్రజా సంక్షేమానికి పునరంకితం కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించారు.
Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను గురువారం నాడు తెలంగాణ నేతలు కలిసి చర్చించారు. ఈ మేరకు టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో సుదీర్ఘంగా చర్చించారు.
సోనియాగాంధీ వ్యాఖ్యలు గిరిజన వ్యతిరేక భావజాలంతో కూడుకున్నాయని ఎంపీలు ఆరోపించారు. పార్లమెంటు పవిత్రత, నిబంధనల పరిరక్షణకు, ప్రజాస్వామ్య సంస్థలు సమర్ధవంతంగా పనిచేసేందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరారు.
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై బీహార్ ముజఫర్‌పూర్ జిల్లాలోని ఓ కోర్టులో శనివారం ఫిర్యాదు దాఖలైంది. దేశ అత్యున్నత రాజ్యాంగ అధికారాన్ని అగౌరవపరిచినందుకు సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ముజఫర్‌పూర్‌కు చెందిన న్యాయవాది సుధీర్ ఓజా ఫిర్యాదు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విషయంలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖల పట్ల కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి కార్యాలయం గౌరవాన్ని నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ కట్టుబడి ఉంటుందని ఖర్గే పునరుద్ఘాటించారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగో లేదని చెప్పేందుకు ఆమె వాడిన "పూర్ థింక్'' అనే పదాన్ని వక్రీకరించి బీజేపీ నేతలు, ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
ఢిల్లీలోని ద్వారకలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, ద్రౌపది ముర్ము ఒక గిరిజన కుటుంబం నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని, ఆమెను అవమానించడం దేశంలోని 10 కోట్ల మంది గిరిజనులను అవమానించడమేనని అన్నారు.