Miserable Country : ప్రపంచంలో అత్యంత దయనీయమైన దేశం ఏదంటే.. ఈ జాబితాలో భారత్ ర్యాంక్..

ABN , First Publish Date - 2023-05-24T21:40:44+05:30 IST

ప్రపంచంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న దేశం జింబాబ్వే అని హాంకేస్ యాన్యువల్ మిజరీ ఇండెక్స్ (Hanke's Annual Misery Index -HAMI) వెల్లడించింది. యుద్ధ పీడిత దేశాలైన ఉక్రెయిన్, సిరియా, సూడాన్‌‌లలో కన్నా దారుణమైన పరిస్థితులు జింబాబ్వేలో ఉన్నాయని తెలిపింది. ఈ దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశానికి తాకుతోందని తెలిపింది.

Miserable Country : ప్రపంచంలో అత్యంత దయనీయమైన దేశం ఏదంటే.. ఈ జాబితాలో భారత్ ర్యాంక్..

న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న దేశం జింబాబ్వే అని హాంకేస్ యాన్యువల్ మిజరీ ఇండెక్స్ (Hanke's Annual Misery Index -HAMI) వెల్లడించింది. యుద్ధ పీడిత దేశాలైన ఉక్రెయిన్, సిరియా, సూడాన్‌‌లలో కన్నా దారుణమైన పరిస్థితులు జింబాబ్వేలో ఉన్నాయని తెలిపింది. ఈ దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశానికి తాకుతోందని తెలిపింది. గత ఏడాది ఈ దేశంలో ద్రవ్యోల్బణం 243.8 శాతమని తెలిపింది.

జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం అప్లయ్‌డ్ ఎకనమిక్స్ పొఫెసర్‌ స్టీవ్ హాంకే 157 దేశాల్లోని ఆర్థిక పరిస్థితులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. కేవలం ఆర్థిక పరిస్థితుల ఆధారంగానే ఈ నివేదికను రూపొందిస్తూ ఉంటారు. స్టీవ్ హాంకే ఇచ్చిన ట్వీట్‌లో, నిర్ఘాంతపోయేలా చేసే ద్రవ్యోల్బణం, అత్యధిక నిరుద్యోగిత, రుణాలపై అత్యధిక వడ్డీ రేట్లు, అతి తక్కువ జీడీపీ వృద్ధి రేటు వంటివాటివల్ల జింబాబ్వే ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన, దయనీయ స్థితిలో ఉన్న దేశంగా నిలిచిందని చెప్పారు. ఇంతకన్నా ఇంకేమైనా చెప్పాలా? అని ప్రశ్నించారు. జింబాబ్వేను పరిపాలిస్తున్న జను-పీఎఫ్ పార్టీ, దాని విధానాలు ఈ దారుణానికి కారణాలని ఆరోపించారు.

హాంకేస్ యాన్యువల్ మిజరీ ఇండెక్స్‌లో మొదటి 15 స్థానాల్లో ఉన్న అత్యంత దయనీయ దేశాల్లో వెనెజులా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జంటైనా, యెమెన్, ఉక్రెయిన్, క్యూబా, టర్కీ, శ్రీలంక, హైతీ, అంగోలా, టోంగా, ఘనా ఉన్నాయి.

స్విట్జర్లాండ్‌లో సంతోషం

స్విట్జర్లాండ్ ప్రజలు సంతోషంగా ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. దుర్భర స్థితికి సంబంధించిన స్కోరు స్విట్జర్లాండ్‌కు తక్కువగా ఉంది. సంతోషంగా ఉన్న దేశాల్లో స్విట్జర్లాండ్ తర్వాతి స్థానాల్లో కువైట్, ఐర్లాండ్, జపాన్, మలేసియా, తైవాన్, నైగర్, థాయ్‌లాండ్, టోగో, మాల్టా ఉన్నాయి.

భారత దేశం పరిస్థితి ఏమిటంటే..

భారత దేశం ఈ ఇండెక్స్‌లో 103వ స్థానంలో ఉంది. నిరుద్యోగం ఎక్కువగా ఉండటంతో ప్రజల్లో విచారం ఉన్నట్లు ఈ ఇండెక్స్ తెలిపింది. అమెరికా 134వ స్థానంలో ఉంది. అమెరికన్ల విచారానికి కారణం కూడా నిరుద్యోగమేనని తెలిపింది. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా వరుసగా ఆరు సంవత్సరాలు నిలిచిన ఫిన్లాండ్ ఈసారి మిజరీ ఇండెక్స్‌లో 109వ స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి :

New Parliament: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై 19 విపక్ష పార్టీల కీలక నిర్ణయం

New Parliament Building : ప్రతిపక్షాలకు అమిత్ షా హితవు

Updated Date - 2023-05-24T22:09:55+05:30 IST