Gyanvapi Survey: జ్ణానవాపి మసీదులో ఏఎస్‌ఐ సర్వేపై స్టే విధించిన సుప్రీం కోర్టు..
ABN , First Publish Date - 2023-07-24T12:43:38+05:30 IST
జ్ణానవాపి మసీదుపై ఏఎస్‌ఐ సర్వేపై 26వ తేదీ వరకూ సుప్రీంకోర్టు స్టే విధించింది. సర్వేపై జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై బుధవారం సాయంత్రం 5గంటల వరకూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రతివాదుల వాదన వినేంతవరకూ స్టే విధించాలని తాము భావిస్తున్నామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. వారణాసి కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించాలని మసీద్ కమిటీకి సుప్రీం సీజేఐ ధర్మాసనం సూచించింది.
ఢిల్లీ: జ్ణానవాపి మసీదుపై ఏఎస్‌ఐ సర్వేపై 26వ తేదీ వరకూ సుప్రీంకోర్టు స్టే విధించింది. సర్వేపై జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై బుధవారం సాయంత్రం 5గంటల వరకూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రతివాదుల వాదన వినేంతవరకూ స్టే విధించాలని తాము భావిస్తున్నామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. వారణాసి కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించాలని మసీద్ కమిటీకి సుప్రీం సీజేఐ ధర్మాసనం సూచించింది. కాశీ విశ్వనాథుడి ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదుపై శాస్త్రీయంగా సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని (ఏఎస్‌ఐను) వారాణసికి చెందిన స్థానిక కోర్టు శుక్రవారం ఆదేశించింది. మసీదు ప్రాంగణంలో శివలింగం ఉన్నదని హిందూ కక్షిదారులు చెబుతున్న ‘వజూఖానా’ను ఈ సర్వే నుంచి మినహాయించింది.
గతంలో హిందూ ఆలయం ఉన్న ప్రదేశంలో మొఘలుల పాలనాకాలంలో జ్ఞానవాపి మసీదును నిర్మించారని, దీనిపై ఏఎస్‌ఐ చేత కార్బన్ డేటింగ్ జరిపించి నిజానిజాలు తేల్చాలని హిందూ కక్షిదారులు చేసిన విజ్ఞప్తిని కోర్టు ఆమోదిస్తూ ఈ ఆదేశాలను ఇచ్చింది. కాగా, కోర్టు తీర్పు తమకు ఆమోదయోగ్యం కాదని, పై కోర్టులో దానిని సవాల్ చేస్తామని మసీదు మేనేజ్‌మెంట్ కమిటీ తరఫు న్యాయవాది మహమ్మద్ తాహిద్ ఖాన్ తెలిపారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు స్టే విధించడం గమనార్హం. గత ఏడాది మే 16న జ్ఞానవాపి మసీదులో కోర్టు ఆదేశాల మేరకు వీడియోగ్రఫీ సర్వే చేస్తుండగా నీటి కొలనులో శివలింగం బయటపడడంతో ఆ ప్రాంతాన్ని సీల్ చేసిన సంగతి తెలిసిందే.