Supreme Court : సేమ్ సెక్స్ మ్యారేజ్‌ చెల్లుబాటు... సుప్రీంకోర్టు విచారణ సోమవారం...

ABN , First Publish Date - 2023-03-11T18:29:12+05:30 IST

సేమ్ సెక్స్ మ్యారేజ్ e)కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు

Supreme Court : సేమ్ సెక్స్ మ్యారేజ్‌ చెల్లుబాటు... సుప్రీంకోర్టు విచారణ సోమవారం...
Supreme Court

న్యూఢిల్లీ : సేమ్ సెక్స్ మ్యారేజ్ (Same Sex Marriage)కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపబోతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు కాజ్ లిస్ట్ వెల్లడించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దీవాలా కూడా ఉన్నారు.

స్త్రీని మరొక స్త్రీ పెళ్లి చేసుకున్నపుడు, పురుషుడు మరొక పురుషుడిని వివాహం చేసుకున్నపుడు ఆ వివాహానికి లీగల్ వ్యాలిడిటీ (చట్టపరమైన చెల్లుబాటు) కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు సహా వివిధ హైకోర్టులలో దాఖలైన పిటిషన్లను కలిపి, సుప్రీంకోర్టు జనవరి 6న తనకు బదిలీ చేసుకుంది.

లిఖితపూర్వక వినతులు, పత్రాలు, పూర్వపు ఉదాహరణలు వంటివాటికి సంబంధించిన సాధారణ అంశాలతో ఓ నివేదికను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం, పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులను సుప్రీంకోర్టు కోరింది. ఈ నివేదికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను ఈ కేసులోని పార్టీలు ఒకరికొకరు ఇచ్చుకోవాలని, వాటిని కోర్టుకు కూడా సమర్పించాలని తెలిపింది.

ఇష్టపూర్వక గే సెక్స్ (gay sex) నేరం కాదని 2018లో తీర్పు చెప్పిన రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఐపీసీ సెక్షన్ 377 హేతుబద్ధమైనది కాదని, సమర్థనీయం కాదని, నిరంకుశమైనదని ఈ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

CBI Vs RJD : తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు... సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు...

Worms Raining : చైనాలో మరో వైపరీత్యం... జనం ఎలా తప్పించుకుంటున్నారంటే...

Updated Date - 2023-03-11T18:29:12+05:30 IST