Himanta Challenge: రాహుల్, సోనియాను అయోధ్యకు తీసుకెళ్ల గలరా?

ABN , First Publish Date - 2023-09-19T19:59:06+05:30 IST

కాంగ్రెస్ నేతలు భూపేష్ బఘెల్, కమల్‌నాథ్‌లకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ హిరంగ సవాలు విసిరారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, సోనియాగాంధీలను అయోధ్యలోని రామాలయానికి తీసుకువెళ్లగలరా అని వారిని నిలదీశారు.

Himanta Challenge: రాహుల్, సోనియాను అయోధ్యకు తీసుకెళ్ల గలరా?

సూరజ్‌పూర్: కాంగ్రెస్ నేతలు భూపేష్ బఘెల్, కమల్‌నాథ్‌లకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (Himanta Biswar Sarma) బహిరంగ సవాలు విసిరారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, సోనియాగాంధీలను అయోధ్యలోని రామాలయానికి తీసుకువెళ్లగలరా అని వారిని నిలదీశారు. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో మంగళవారంనాడు జరిగిన బహిరంగ సభలో అసోం సీఎం ఈ సవాలు విసిరారు.


''మేము కూడా హిందువులమేనని మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్, ఛత్తీస్‌గఢ్‌లో భూపేష్ బఘెల్ చెబుతున్నారు. నిజంగానే వాళ్లు హిందువులతే ఒకసారైనా అయోధ్యలోని రామలల్లా ఆలయానికి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీని తీసుకు వెళ్లాలి'' అని శర్మ అన్నారు.


డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. 'ఇండియా' బ్లాక్‌లోనూ ఆ రెండు పార్టీలు భాగస్వామిగా ఉండటంతో ప్రధానమంత్రి మోదీ సైతం విపక్ష కూటమిని హిందూ వ్యతిరేక కూటమిగా అభివర్ణించారు. దీనిపై ఇటీవల హిమంత బిస్వ శర్మ విమర్శలు గుప్పిస్తూ, డీఎంకే నేత వివిదాస్పద వ్యాఖ్యలు చేసినా కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండలేకపోయిందని, ఇది కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకతను మరోసారి బహిర్గతం చేసిందని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత కార్తీ చిదంబరం సమర్ధించడం దేనికి సంకేతమని నిలదీశారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు దగ్గరగానే కార్తీ చిదంబరం, మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు.

Updated Date - 2023-09-19T19:59:06+05:30 IST