Share News

BJP MPs resign: ఇద్దరు మంత్రులతో సహా 10 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా..ఎందుకంటే..?

ABN , First Publish Date - 2023-12-06T15:32:59+05:30 IST

బీజేపీలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 12 మంది బీజేపీ ఎంపీలలో గెలుపొందిన 10 మంది ఎంపీలు తమ పార్లమెంటు సభ్యత్వానికి బుధవారంనాడు రాజీనామా చేశారు.

BJP MPs resign: ఇద్దరు మంత్రులతో సహా 10 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా..ఎందుకంటే..?

న్యూఢిల్లీ: బీజేపీ (BJP)లో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 12 మంది బీజేపీ ఎంపీలలో గెలుపొందిన 10 మంది ఎంపీలు తమ పార్లమెంటు సభ్యత్వానికి బుధవారంనాడు రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశం అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది.


పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎంపీలలో మధ్యప్రదేశ్‌ నుంచి గెలిచిన నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్, రీతీ పాథక్, ఛత్తీస్‌గఢ్ నుంచి అరుణ్ సవో, గోమతి సాయి, రాజస్థాన్ నుంచి రాజ్యవర్ధన్ రాథోడ్, కిరోడి లాల్ మీనా ఉన్నారు. తోమర్, పటేల్ కేంద్ర మంత్రివర్గానికి కూడా రాజీనామా చేశారు. కిరోడి లాల్ మీనా రాజ్యసభకు రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి రేణుకా సింగ్, మహంత్ బాలక్‌నాథ్ కూడా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ రాజీనామాల పర్యం చోటుచేసుకుంది.

Updated Date - 2023-12-06T15:33:01+05:30 IST