Bans Sale Of Fish: ఈ రాష్ట్రంలో 15రోజులపాటు చేపల దిగుమతి, అమ్మకాలపై నిషేధం విధించారు.. ఎందుకంటే..?

ABN , First Publish Date - 2023-06-10T22:11:01+05:30 IST

పల దిగుమతి, డిస్ట్రిబ్యూషన్, అమ్మకాలపై మేఘాలయ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం పదేహేను రోజుల పాటు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Bans Sale Of Fish: ఈ రాష్ట్రంలో 15రోజులపాటు చేపల దిగుమతి, అమ్మకాలపై నిషేధం విధించారు.. ఎందుకంటే..?

షిల్లాంగ్: చేపల దిగుమతి, డిస్ట్రిబ్యూషన్, అమ్మకాలపై మేఘాలయ ప్రభుత్వం(Meghalaya Government) నిషేధం విధించింది(Implemented Ban). ఈ నిషేధం పదేహేను రోజుల పాటు కొనసాగుతుందని స్పష్టం చేసింది. దిగుమతి చేసుకున్న చేపట్లో ఫార్మాలిన్ అధికంగా ఉన్నట్లు గుర్తించిన మేఘాలయ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి పదేళ్ల జైలు శిక్ష(Imprisonment), రూ.10 లక్షల జరిమానా(Fine of Rs.10 Lakhs) విధించబడుతుందని మేఘాలయ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మొత్తం 40 రకాల చేపల నమూనాలు పరీక్షించగా..30 రకాల చేపల్లో ఫార్మాలిన్ గుర్తించినట్లు మేఘాలయ ఆహార భద్రత కమిషనర్ తెలిపారు. మంగళవారం ఫుడ్ ఎనలిస్ట్ అందించిన నివేదికలు,నమూనాల ప్రకారం..ఈ చేపలు అత్యంత విషపూరితమైన, ఆరోగ్యానికి ప్రమాదకరం అని స్పష్టం చేశారు. 2011 ఆహార భద్రత, ప్రమాణాల ప్రకారం..ఫార్మాలిన్(Formalin) లేదా అనుమతించబడని రసాయనాలతో శుధ్ది చేసిన చేపలు సురక్షితం కాదని మేఘాలయ ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. 15 రోజులు పాటు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. కాగా..ఆంధ్రప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లనుంచి మేఘాలయకు చేపలు దిగుమతి అవుతాయి.

Updated Date - 2023-06-10T22:11:01+05:30 IST