చెన్నైలో ఆ బైక్ సేవలు నిషేధించాలి
ABN , First Publish Date - 2023-04-22T10:21:50+05:30 IST
ప్రయాణ ఖర్చు తక్కువగా ఉండడంతో చాలా మంది బైక్‌ను వినియోగించుకుంటున్నారని, దీంతో తమకు భారీగా నష్టం వాటిల్లుతోందని
ప్యారీస్(చెన్నై): ప్రయాణ ఖర్చు తక్కువగా ఉండడంతో చాలా మంది రాపిడో(Rapido) బైక్‌ను వినియోగించుకుంటున్నారని, దీంతో తమకు భారీగా నష్టం వాటిల్లుతోందని ఆటో కార్మికుల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. దీనిపై శుక్రవారం చెన్నై ఆటో కార్మికుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రవాణా శాఖ కమిషనర్ నిర్మల్‌రాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. నగరంలో మొబైల్ యాప్ ద్వారా ఊబెర్, ఓలా(Uber, Ola) సంస్థల ద్వారా నడుపుతున్న కారు, ఆటోల్లో అద్దె చెల్లించి ప్రయాణం చేసే వసతి అందుబాటులో ఉందని, అయితే ఇటీవలి కాలంలో రాపిడ్ బైక్ వసతి కూడా అందుబాటులోకి రావడంతో తాము భారీగా నష్టపోతున్నామని కార్మికులు పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని వినతి చేశారు.