Vande Bharat : వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు వడగళ్ల వర్షం దెబ్బ...రద్దు

ABN , First Publish Date - 2023-05-22T10:31:16+05:30 IST

పూరి- హౌరా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు వడగళ్ల వర్షం దెబ్బ తగిలింది. పూరి-హౌరా వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన మూడు రోజులకే వడగళ్ల వర్షం వల్ల దెబ్బ తిని నిలిచిపోయింది....

Vande Bharat : వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు వడగళ్ల వర్షం దెబ్బ...రద్దు
Puri-Howrah Vande Bharat Express

పూరి : పూరి- హౌరా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు వడగళ్ల వర్షం దెబ్బ తగిలింది. పూరి-హౌరా వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన మూడు రోజులకే వడగళ్ల వర్షం వల్ల దెబ్బ తిని నిలిచిపోయింది.(Puri-Howrah Vande Bharat Express)వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును వడగళ్ల వాన వల్ల రైలు ప్యాంటోగ్రాఫ్, ఫ్రంట్ గ్లాస్, డ్రైవర్ క్యాబిన్ సైడ్ అద్దాలు విరిగిపోయాయి.పూరి- హౌరా మధ్య నడుస్తున్న రైలు ఆదివారం ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వర్షం(storm) కురవడం వల్ల పాంటోగ్రాఫ్ విరిగిపోవడంతో(pantograph breaks) రైలు దులాఖ పట్నా-మంజురి రోడ్ స్టేషన్ మధ్య నిలిచిపోయింది. రైలు అద్దాలు, కిటికీలు కూడా దెబ్బతిన్నాయి.

ఇది కూడా చదవండి : G20 Meet: శ్రీనగర్‌లో జి 20 సదస్సు... మెరైన్ కమాండోలు, జాతీయ భద్రతా గార్డులతో భారీ భద్రత

భారీవర్షం కారణంగా రైలు ఓవర్‌హెడ్ వైర్‌పై చెట్టు పడిపోయిందని, దీని కారణంగా పాంటోగ్రాఫ్ విరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.నాలుగు గంటలపాటు వడగళ్ల వర్షం ఆగిన తర్వాత రైలును డీజిల్ ఇంజిన్ సహాయంతో లాగి సోమవారం తెల్లవారుజామున హౌరా స్టేషన్‌కు చేర్చారు.రైలును డీజిల్ ఇంజన్ సహాయంతో హౌరాకు తీసుకెళ్లడానికి ముందు భద్రక్ స్టేషన్ మేనేజర్ పూర్ణ చంద్ర షాహువిధ్వంసాన్ని పరిశీలించారు. ‘‘ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం కారణంగా డ్రైవర్ క్యాబిన్ ముందు అద్దాలు, పక్క కిటికీలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు’’ అని స్టేషన్ మేనేజర్ చెప్పారు.రైలులో ఏసీ పనిచేయ లేదని ప్రయాణికులు వాపోయారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ పెద్ద శబ్దం రావడంతో రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. హౌరా-పూరి-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం రద్దు చేసినట్లు భారతీయ రైల్వే అధికారులు ప్రకటించారు.

Updated Date - 2023-05-22T10:31:16+05:30 IST