Toll fee: రాష్ట్రంలో టోల్‌ పన్ను పెంపు.. ఈనెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి..

ABN , First Publish Date - 2023-03-10T10:09:43+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా 29 టోల్‌ప్లాజాలలో ఈనెల 31వ తేది అర్ధరాత్రి నుంచి వాహనాల పన్ను పెంచనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 55 టోల్‌ప్లాజాలుండగా, వాటిలో 29

Toll fee: రాష్ట్రంలో టోల్‌ పన్ను పెంపు.. ఈనెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి..

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రవ్యాప్తంగా 29 టోల్‌ప్లాజాలలో ఈనెల 31వ తేది అర్ధరాత్రి నుంచి వాహనాల పన్ను పెంచనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 55 టోల్‌ప్లాజాలుండగా, వాటిలో 29 ప్రధాన టోల్‌ప్లాజా(Toll Plaza)లలో 5 నుంచి 15 శాతం వరకు టోల్‌ పన్ను పెంచేందుకు పథకం తీర్చిదిద్దారు. దీనికి పరిశీలించిన కేంద్ర రహదారుల శాఖ మంత్రిత్వ శాఖ పన్ను పెంపునకు అనుతులు జారీ చేసినట్లు తెలిసింది. చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కోవై, మదురై(Chennai to Andhra Pradesh, Karnataka, Kovai, Madurai) ప్రాంతాలకు వెళ్లాల్సిన రహదారుల్లో ఏర్పాటుచేసిన టోల్‌ప్లాజాలలో పెంచిన పన్ను ఈనెల 31వ తేది అర్ధరాత్రి నుంచి వాహనదారుల నుంచి వసూలు చేస్తారు. ఈ నేపథ్యంలో, శివారు ప్రాంతాలైన వానగరం, సూరపట్టు, రెడ్‌హిల్స్‌ తదితర ఐదు టోల్‌ప్లాజాలలో టోల్‌ పన్ను పెంచనున్నట్లు తెలిసింది. టోల్‌ పన్ను పెంచడం వల్ల ప్రైవేటు బస్సుల టిక్కెట్టు ధర, నిత్యావసరాల సరుకుల ధర పెరిగే ప్రమాదముందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2023-03-10T10:09:43+05:30 IST