Tomato: కిలో టమోటా రూ.60

ABN , First Publish Date - 2023-07-13T07:41:22+05:30 IST

సహకార శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 302 రేషన్‌ దుకాణాల్లో బుధవారం టమోటా(Tomato) విక్రయాలు ప్రారంభమయ్యాయి. దుకాణాల ముందు ప్ర

Tomato: కిలో టమోటా రూ.60

- 302 రేషన్‌ దుకాణాల్లో విక్రయాలు ప్రారంభం

పెరంబూర్‌(చెన్నై): సహకార శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 302 రేషన్‌ దుకాణాల్లో బుధవారం టమోటా(Tomato) విక్రయాలు ప్రారంభమయ్యాయి. దుకాణాల ముందు ప్రజలు అధిక సంఖ్యలో బారులు తీరి కొనుగోలు చేసి వెళ్లారు. వివిధ కారణాలతో టమోటా ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. చిల్లర దుకాణాల్లో కిలో రూ.130 నుంచి రూ.140 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా 302 రేషన్‌ దుకాణాల్లో టమోటా విక్రయాలు ప్రారంభించారు. కిలో రూ.60 చొప్పున, ఒకరికి కిలో మాత్రమే విక్రయించారు. చెన్నై(Chennai)లో కాంచీపురం జిల్లా వినియోగదారుల సహకార విక్రయ కేంద్రం ఆధ్వర్యంలో రామాపురం, మడిపాక్కం, పోరూర్‌, వలసరవాక్కం, మధురవాయల్‌, లక్ష్మీనగర్‌, వానగరం, కందన్‌చావిడి, కారపాక్కం రేషన్‌ దుకాణాల్లో టమోటాలు విక్రయిస్తున్నారు. అలాగే, ట్రిప్లికేన్‌ నగర సహకార శాఖ దుకాణాలు, రాయపేట, బిసెంట్‌నగర్‌, శాస్త్రినగర్‌, అవ్వైనగర్‌, తేనాంపేట, ఆళ్వార్‌పేట, శ్రీరామ్‌నగర్‌, టి.నగర్‌, చెట్‌పేట్‌, కోడంబాక్కం, లక్ష్మిపురం, నుంగంబాక్కం, గోపాలపురం, ఆర్‌ఏ పురం, సైదాపేట, చిన్నమలై, గిండి, కేకేనగర్‌, ఆర్‌కే నగర్‌, ఎరుకంజేరి, మనలి, మాంబళం, శాలిగ్రామం, వేళచ్చేరి, ఆదంబాక్కం అని 87 రేషన్‌ దుకాణాల్లో టమోటా విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే, మదురై, కోవై, తిరుచ్చి(Madurai, Kovai, Trichy) మండలాల్లో తలా 20, సేలం, తిరునల్వేలి, తిరుప్పూర్‌, వేలూరు, ఈరోడ్‌, తూత్తుకుడి, తంజావూరు మండలాల్లో తలా 15, దిండుగల్‌, కాంచీపురం, కరూర్‌, కడలూరు, విల్లుపురం మండలాల్లో తలా 10, కన్నియాకుమారిలో 5 అని మొత్తం 215 దుకాణాల్లో టమోటా విక్రయాలు ప్రారంభమయ్యాయని సహకార శాఖ అధికారులు తెలిపారు.

nani1.2.jpg

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-07-13T07:41:22+05:30 IST