Tomato: టమోటా కిలో రూ.60

ABN , First Publish Date - 2023-08-02T07:07:41+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా 500 రేషన్‌ దుకాణాల్లో మంగళవారం నుంచి పోలీసు భద్రత నడుమ టమోటా(Tomato) విక్రయాలు ప్రారంభమయ్యాయి. దుకాణాల వద్ద

Tomato: టమోటా కిలో రూ.60

- రాష్ట్రవ్యాప్తంగా 500 రేషన్‌ దుకాణాల్లో విక్రయాలు

- బారులు తీరిన ప్రజలు

- పోలీసు బందోబస్తు

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రవ్యాప్తంగా 500 రేషన్‌ దుకాణాల్లో మంగళవారం నుంచి పోలీసు భద్రత నడుమ టమోటా(Tomato) విక్రయాలు ప్రారంభమయ్యాయి. దుకాణాల వద్ద ప్రజలు భారీగా క్యూలలో వేచి ఉంచి టమోటాలు కొనుగోలు చేశారు. భారీ వర్షాలు, ఎండల కారణంగా టమోటా విక్రయాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు భారీగా పెరగడంతో పాటు నెలరోజులు ఇదే ధరలు కొనసాగాయి. స్థానిక కోయంబేడు మార్కెట్‌(Koyambedu Market)లో సోమవారం టమోటా కిలో రూ.200 పలకగా, మంగళవారం ఉదయం రూ.140కి విక్రయమైంది. ఇక, చిల్లర దుకాణాల్లో కిలో రూ.150 నుంచి 170 వరకు పలికింది. దీనిపై దృష్టి సారించిన రాష్ట్రప్రభుత్వం సహకార శాఖ ఆధ్వర్యంలోని చెన్నైలోని 27 గ్రీన్‌ హౌస్‌ దుకాణాలు, 2 సంచార గ్రీన్‌ హౌస్‌ దుకాణాల ద్వారా టమోటా కిలో రూ.60కి గత నెలలో విక్రయాలు ప్రారంభించింది. కానీ, దిగుమతులు తగ్గి ధరలు మరింత పెరుగుతుండంతో నగరంలో 82 సహా రాష్ట్రవ్యాప్తంగా 302 రేషన్‌ దుకాణాల్లో టమోటా విక్రయాలు ప్రారంభించింది.

ఒకరికి కిలో చొప్పున టమోటాలు విక్రయించడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో, రెండు రోజుల క్రితం టమోటా కిలో రూ.200కి చేరింది. ఈ వ్యవహారంపై సహకారశాఖ మంత్రి పెరియకరుప్పన్‌ పలు శాఖల అధికారులతో సోమవారం సమావేశమై టమోటా దిగుమతులు, ధరలు, విక్రయాలను సమీక్షించారు. అనంతరం ప్రజల సౌకర్యార్థ్యం ప్రస్తుతం విక్రయిస్తున్న 302 దుకాణాలు సహా 500 దుకాణాల్లో టమోటా విక్రయించాలని నిర్ణయించారు. ఆ ప్రకారం మంగళవారం నుంచి టమోటా కిలో రూ.60కి విక్రయాలు ప్రారంభమయ్యాయి. క్యూ వద్ద ఘర్షణలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దుకాణాల్లో ఏజెంట్లు, దళారులు టమోటాలు కొనుగోలు చేయడాన్ని అడ్డుకొనేలా ప్రత్యేక అధికారుల బృందం పర్యవేక్షిస్తోంది. టమోటా ధరలు తగ్గే వరకు రేషన్‌ దుకాణాల్లో విక్రయాలు కొనసాగిస్తామని సహకార శాఖ అధికారులు తెలిపారు.

nani1.2.jpg

Updated Date - 2023-08-02T07:38:29+05:30 IST