Tomato: మళ్లీ పెరిగింది.. టమోటా కిలో రూ.140

ABN , First Publish Date - 2023-07-28T11:01:39+05:30 IST

మార్కెట్‌లో గురువారం టమోటా(Tomato) కిలో రూ.30 పెరిగి రూ.140కి విక్రయమైంది. వీటితో పాటు అల్లం, బీన్స్‌, పచ్చ బఠాని ధరలు కూడా భారీగా

Tomato: మళ్లీ పెరిగింది.. టమోటా కిలో రూ.140

- అల్లం, బీన్స్‌ ధరలు కూడా పైపైకి

పెరంబూర్‌(చెన్నై): స్థానిక కోయంబేడు మార్కెట్‌లో గురువారం టమోటా(Tomato) కిలో రూ.30 పెరిగి రూ.140కి విక్రయమైంది. వీటితో పాటు అల్లం, బీన్స్‌, పచ్చ బఠాని ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈ మార్కెట్‌కు ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక(Andhra, Maharashtra, Gujarat, Karnataka) రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి టమోటాలు దిగుమతవుతుంటాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా టమోటా ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. సాధారణంగా 600 లారీల టమోటాలు దిగుమతి కావాల్సి ఉండగా, ప్రస్తుతం 30 లారీలు మాత్రమే వస్తుండడంతో వాటి ధరలు పెరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం కిలో టమోటా రూ.50 విక్రయం కాగా, మరుసటిరోజు రూ.15, బుధవారం మరో రూ.10 పెరిగి రూ.110కి విక్రయమయ్యాయి. కానీ, గురువారం ఒక్కసారిగా రూ.30 పెరిగి రూ.140కి విక్రయమైంది. ఇక, చిల్లర దుకాణాల్లో రూ.170 నుంచి రూ.180 వరకు ధర పలికింది. అలాగే, బీన్స్‌ కిలో రూ.80, అల్లం రూ.280, పచ్చి మిర్చి రూ.90, పచ్చి బఠాని రూ.200 వరకు ధరలు పెరిగాయి. పొరుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడంతో ఈ ధరలు మరింత పెరిగి టమోటా కిలో రూ.200 వరకు పెరిగే అవకాశముందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

nani10.2.jpg

Updated Date - 2023-07-28T11:01:39+05:30 IST