Tomato: రూ. 10 తగ్గిన టమోటా ధర.. కిలో ఎంతంటే...

ABN , First Publish Date - 2023-08-09T08:00:50+05:30 IST

స్థానిక కోయంబేడు మార్కెట్లో(Koyambedu market) మంగళవారం టమోటా కిలో రూ.10కి తగ్గి రూ.90కి విక్రయమైంది. వర్షాల కారణంగా పొరుగు

Tomato: రూ. 10 తగ్గిన టమోటా ధర.. కిలో ఎంతంటే...

పెరంబూర్‌(చెన్నై): స్థానిక కోయంబేడు మార్కెట్లో(Koyambedu market) మంగళవారం టమోటా కిలో రూ.10కి తగ్గి రూ.90కి విక్రయమైంది. వర్షాల కారణంగా పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడంతో ఎన్నడూ లేని విధంగా కిలో టమోటా రూ.200 ధర పలికింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్‌కు టమోటా దిగుమతులు పెరిగి ఈనెల 2వ తేది నుంచి ధరలు తగ్గి, సోమవారం రూ.100 పలికిన కిలో మంగళవారం రూ.90కి తగ్గింది. ఇక, దిండుగల్‌(Dindugal) జిల్లా ఓట్టాన్‌సత్రం మార్కెట్లో కిలో టమోటా రూ.40కి విక్రయమవుతోంది.

Updated Date - 2023-08-09T08:00:52+05:30 IST