Tomato: రూ.20 తగ్గిన టమోటా
ABN , First Publish Date - 2023-08-05T11:48:07+05:30 IST
స్థానిక కోయంబేడు మార్కెట్లో దిగుమతులు పెరగడంతో శుక్రవారం టమోటా(Tomato) కిలో రూ.20కి తగ్గి రూ.120కి విక్రయమైంది.
వేళచ్చేరి(చెన్నై): స్థానిక కోయంబేడు మార్కెట్లో దిగుమతులు పెరగడంతో శుక్రవారం టమోటా(Tomato) కిలో రూ.20కి తగ్గి రూ.120కి విక్రయమైంది. అలాగే, రెండో రకం టమోటా కిలో రూ.80 పలికింది. ఇక, రేషన్ దుకాణాల్లో కిలో టమోటా రూ.60 విక్రయాలు కొనసాగగా, ప్రజలు క్యూలో వేచి ఉండి మరీ కొనుగోలు చేశారు. భారీవర్షాల కారణంగా పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో టమోటా దిగుబడులు తగ్గి, కిలో రూ.200 వరకు ధర పలికింది. ఈ నేపథ్యంలో, వారం రోజులుగా వర్షాలు లేకపోవడం, సాగు చేసిన టమోటా కోతలు ముగియడంతో కోయంబేడు మార్కెట్(Koyambedu Market)కు టమోటా దిగుమతులు పెరిగడంతో ధర తగ్గింది. మరో రెండు వారాల్లో దిగుమతులు పెరిగి టమోటాలు సాధరణ ధరకు విక్రయమయ్యే అవకాశముందని వ్యాపారులు తెలిపారు.