Tomato: ఆ సోదరుల ఉదారత భేష్‌! తక్కువ ధరకే గ్రామస్తులకు టమోటాలు..

ABN , First Publish Date - 2023-08-04T07:55:43+05:30 IST

దేశవ్యాప్తంగా టమోటా ధరలు ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం టమోటా(Tomato) సాగు చేసిన రైతులు లక్షాధికారులవుతున్నారు. అయితే తమ గ్రామస్తులకు

Tomato: ఆ సోదరుల ఉదారత భేష్‌! తక్కువ ధరకే గ్రామస్తులకు టమోటాలు..

- నీలగిరి జిల్లా అన్నదమ్ములకు సర్వత్రా ప్రశంసలు

పెరంబూర్‌(చెన్నై): దేశవ్యాప్తంగా టమోటా ధరలు ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం టమోటా(Tomato) సాగు చేసిన రైతులు లక్షాధికారులవుతున్నారు. అయితే తమ గ్రామస్తులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకున్న నీలగిరి(Nilgiri) జిల్లా కుందాకు చెందిన రైతు సోదరులు తక్కువ ధరకే వాటిని విక్రయిస్తూ పలువురి చేత శెభాష్‌ అనిపించుకుంటున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా వారు చేస్తున్న ఈ సాయాన్ని గ్రామస్తులు అభినందించకుండా ఉండలేకపోతున్నారు.

నీలగిరి జిల్లాలో ప్రస్తుతం కిలో టమోటా(Tomato) రూ.150 ధర పలుకుతుండగా, కుందాకు చెందిన రైతు సోదరులు రామన్‌, పుట్టసామి రూ.80కే విక్రయిస్తున్నారు. ఈ విషయమై వారు మాట్లాడుతూ... వ్యవసాయం ప్రధానవృత్తిగా ఉన్న తమ ప్రాంతంలో అందరూ కూరగాయల సాగు చేపడుతుంటారని తెలిపారు. ఇంట్లో అవసరాల కోసం ఒకసారి టమోటా సాగు చేయగా, ఆ సమయంలో మంచి ధర పలకడంతో మార్కెట్లో విక్రయించామని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి టమోటా సాగు చేస్తున్నామన్నారు. ఏప్రిల్‌లో మైసూరు నుంచి 1,000 టమోటా మొక్కలు తీసుకొచ్చి నాటామని, ఆ సమయంలో టమోటా ధర కిలో రూ.10గా ఉందన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా పంట ఆలస్యంగా చేతికొచ్చిందన్నారు. అయితే ఒకందుకు అది కూడా మంచిదే అయ్యిందన్నారు. జిల్లాలో కిలో రూ.150కి విక్రయమవుతుండగా, తమ గ్రామ ప్రజలకు రూ.80కే అందిస్తున్నామన్నారు. మార్కెట్లో కిలో రూ.200కు పెరిగినా, తాము రూ.80కే విక్రయుంచాలని నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు 1,000 కిలోల వరకు గ్రామంలో విక్రయించామమని, పొరుగు ప్రాంతాల వ్యాపారులొచ్చి అధిక ధర ఇస్తామని తెలిపినా తాము ఆశపడలేదన్నారు.

nani2.2.jpg

Updated Date - 2023-08-04T07:55:44+05:30 IST