Tomato: అమాంతం తగ్గిన టమోటా ధర.. కిలో ఎంతంటే...

ABN , First Publish Date - 2023-08-30T10:44:47+05:30 IST

నెలరోజుల క్రితం కిలో రూ.200 వరకు ధర పలికిన టమోటా(Tomato)లు ప్రస్తుతం కిలో రూ.10కు పడిపోయాయి.

Tomato: అమాంతం తగ్గిన టమోటా ధర.. కిలో ఎంతంటే...

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): నెలరోజుల క్రితం కిలో రూ.200 వరకు ధర పలికిన టమోటా(Tomato)లు ప్రస్తుతం కిలో రూ.10కు పడిపోయాయి. బెంగళూరులోని కృష్ణరాజేంద్ర (కేఆర్‌) మార్కెట్‌కు రెండు మూడు రోజులుగా టమోటా భారీగా తరలిరావడమే ఇందుకు కారణమని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. కేఆర్‌ మార్కెట్‌లో మంగళవారం కిలో టమోటా రూ.5-10 వరకు పలి కాయి. మైసూరు(Mysore) ఏపీఎంసీ మార్కెట్‌లో కిలో టమోటా రూ.14 పలికింది. రిటైల్‌ దుకాణాల్లో కిలో రూ.20గా ఉంది. వినాయక చవితి పండుగ నాటికి టమోటా ధర కాస్త పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.

Updated Date - 2023-08-30T10:44:49+05:30 IST