Tomato: టమోటా ధర మరింత పతనం.. కిలో ఎంతంటే...

ABN , First Publish Date - 2023-09-08T12:20:58+05:30 IST

మార్కెట్లో కాయగూరల ధరలు ఏ సమయంలో ఎలా వుంటాయో రైతన్నలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం టమోటా(Tomato)

Tomato: టమోటా ధర మరింత పతనం.. కిలో ఎంతంటే...

కంప్లి(బెంగళూరు): మార్కెట్లో కాయగూరల ధరలు ఏ సమయంలో ఎలా వుంటాయో రైతన్నలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం టమోటా(Tomato) ధర ఆకాశాన్ని తాకింది. కిలో రూ. 200 నుంచి రూ. 250లు పలికింది. ఇప్పుడు కిలో రూ. పదికి పడిపోయింది. దీంతో ఒక్కసారిగా రైతన్నల ఆశలు నీరుగారిపోయాయి. ధరలు తగ్గిపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రావటంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యాపారస్తులు అయితే ప్రత్యేకించి ఆటోల ద్వారా వార్డుల్లో తిరుగుతూ కిలో రూ. 15లకు అమ్మకాలు చేసే పరిస్థితి ఏర్పడింది.

Updated Date - 2023-09-08T12:20:58+05:30 IST