Tomato: ఆదాయం కురిపించిన టమోటా.. ఒకేరోజు రూ.1.49 లక్షలు పొందిన రైతు

ABN , First Publish Date - 2023-08-02T08:05:35+05:30 IST

ప్రస్తుతం టమోటా సాగుచేస్తున్న రైతు ఒక్కరోజులోనే ధనవంతులవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు టమోటా(Tomato) రైతులు కోట్లకు ప

Tomato: ఆదాయం కురిపించిన టమోటా.. ఒకేరోజు రూ.1.49 లక్షలు పొందిన రైతు

వేళచ్చేరి(చెన్నై): ప్రస్తుతం టమోటా సాగుచేస్తున్న రైతు ఒక్కరోజులోనే ధనవంతులవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు టమోటా(Tomato) రైతులు కోట్లకు పడగలెత్తినట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా తిరుప్పూర్‌(Tiruppur) జిల్లాకు చెందిన ఓ రైతు ఒకేరోజులో లక్షాధికారిగా మారాడు. వర్షాల కారణంగా దిగుబడులు తగ్గి టమోటా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. తిరుప్పూర్‌ బస్టాండ్‌ సమీపంలోని మార్కెట్‌లో కిలో టమోటా రూ.115గా నిర్ణయించారు. ఆ ప్రకారం, సేవూరు సమీపం వేలయన్‌కాడుతోట ప్రాంతానికి చెందిన రైతు తిరుమూర్తి తన తోటలో సాగుచేసిన టమోటా విక్రయాల ద్వారా ఒకే రోజు రూ.1.49 లక్షలు సంపాదించారు. ఈ విషయమై తిరుమూర్తి మాట్లాడుతూ, తన ఎకరాల పొలంలో 5,500 టమోటా మొక్కలు సాగుచేశానని, మూడు నెలలుగా రూ.50 నుంచి రూ.60 వేలు ఖర్చు చేశానని, ప్రస్తుతం మంచి ఆదాయం లభించడం ఆనందంగా ఉందన్నారు.

Updated Date - 2023-08-02T08:05:35+05:30 IST