Trains: గంటల కొద్దీ ఆలస్యంగా రైళ్లు.. కారణం ఏంటంటే..
ABN , First Publish Date - 2023-08-09T08:56:11+05:30 IST
నాగర్‌కోయిల్ - తిరునల్వేలి మధ్య ట్రాక్ డబ్లింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో నాగర్‌కోయిల్‌కు పలు రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా
అడయార్(చెన్నై): నాగర్‌కోయిల్ - తిరునల్వేలి మధ్య ట్రాక్ డబ్లింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో నాగర్‌కోయిల్‌కు పలు రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా వచ్చి చేరుతున్నాయి. నాగర్‌కోయిల్ - నెల్లై(Nagercoil - Nellai) మార్గంలో నాగర్‌కోయిల్ జంక్షన్ - ఆరల్వాయ్‌మొళి మధ్య డబుల్ ట్రాక్ నిర్మాణ పనులు గత కొన్ని రోజులుగా ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు సిగ్నల్ నిర్మాణం, కేబుళ్ల ఏర్పాటు పనులు కూడా శరవేగంగా పూర్తి చేసే పనుల్లో అధికారులు నిమగ్నమైవున్నారు. ఈ కారణంగా చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు(Chennai, Coimbatore, Bangalore) తదితర ప్రాంతాలనుంచి నాగర్‌కోయిల్ జంక్షన్‌కు రావాల్సిన అనేక రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా చేరుకుంటున్నాయి.
ఎగ్మూర్ నుంచి కన్నియాకుమారికి వెళ్ళే ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజూ ఉదయం 5 గంటలకే నాగర్‌కోయిల్ జంక్షన్‌కు చేరుకుంటుంది. కానీ, మంగళవారం దాదాపు 2.30 గంటల ఆలస్యంగా 7.15 గంటలకు చేరింది. ఆరల్వాయ్‌మొళి వద్ద దాదాపు ఒకటిన్నర గంటపాటు ఈ రైలును నిలిపివేశారు. ఇదే విధంగా రామేశ్వరం నుంచి కన్నియాకుమారికి వెళ్ళాల్సిన రైలు వేకువజామున 4 గంటలకు రావాల్సి ఉండగా, నాగర్‌కోయిల్‌కు 8.10 గంటలకు చేరుకుంది. చెన్నై నుంచి కొల్లం వెళ్ళాల్సిన అనంతపురి ఎక్స్‌ప్రెస్ కూడా ఉదయం 8.07 గంటలకు రావాల్సి ఉండగా, ఉదయం 9.20 గంటలకు వచ్చింది. దీంతో నాగర్‌కోయిల్ జంక్షన్‌లో ప్రయాణికులు గంటల కొద్ది నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.