Uttarakhand: ఇనుప వంతెన కూలి నదిలో పడిన ట్రక్కు
ABN , First Publish Date - 2023-04-17T07:29:01+05:30 IST
ఓ ఇనుప వంతెన ఆకస్మాత్తుగా కూలిపోవడంతో ట్రక్కు నదిలో పడిన దుర్ఘటన...
చమోలీ(ఉత్తరాఖండ్): ఓ ఇనుప వంతెన ఆకస్మాత్తుగా కూలిపోవడంతో ట్రక్కు నదిలో పడిన దుర్ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.(Uttarakhand) చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీని కలుపుతూ ధౌలిగంగా నదిపై నిర్మించిన ఇనుప వంతెన(Iron Bridge Collapses) అకస్మాత్తుగా విరిగిపోయింది.(Truck Falls)దీంతో వంతెనపై వస్తున్న ట్రక్కు నదిలో పడిపోయింది. మలారి సమీపంలోని బురాన్‌లోని నీతి వ్యాలీని కలిపే ధౌలిగంగా నదిపై ఈ ఘటన జరిగిందని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కమాండర్ కల్నల్ అంకుర్ మహాజన్ చెప్పారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కల్నల్ తెలిపారు.బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వంతెన నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించారు.వాహనాలను ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించామని అధికారులు తెలిపారు.ధౌలిగంగాపై కాజ్‌వే నిర్మిస్తున్నామని, ఇది రేపటిలోగా పూర్తవుతుందని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు చెప్పారు.