Udayanidhi: ‘బీజేపీ-అన్నాడీఎంకే’లా కాపురం చేయొద్దు
ABN , First Publish Date - 2023-02-09T10:16:51+05:30 IST
‘బీజేపీ-అన్నాడీఎంకే’లా ఒకరికొకరు బానిసలుగా ఉండరాదని మంత్రి ఉదయనిధి స్టాలిన్(Minister Udayanidhi Stalin) నూతన వధూవరులకు స
- వధూవరులకు ఉదయనిధి సలహా
పెరంబూర్(చెన్నై), ఫిబ్రవరి 8: ‘బీజేపీ-అన్నాడీఎంకే’లా ఒకరికొకరు బానిసలుగా ఉండరాదని మంత్రి ఉదయనిధి స్టాలిన్(Minister Udayanidhi Stalin) నూతన వధూవరులకు సలహా ఇచ్చారు. కాంచీపురం(Kanchipuram) జిల్లా చందవేలూరులో మంగళవారం రాత్రి జరిగిన వివాహ వేడుకలకు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆత్మగౌరవంతో, పెరియార్ ఆదర్శాలతో, అన్నా చూపిన బాటలో, కరుణానిధి తమిళంలాగా, ముఖ్యమంత్రి స్టాలిన్ చేస్తున్న ద్రావిడ మోడల్ పాలనలా కలసిమెలసి జీవితాంతం జీవించాలని మంత్రి ఉదయనిధి కోరారు.
ఇదికూడా చదవండి: ఉప‘పోరు’లో ఊపందుకున్న ప్రచారం