Hindu Goddess : కాళీ మాతను అవమానించిన ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ

ABN , First Publish Date - 2023-04-30T16:49:29+05:30 IST

ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ కాళీ మాతను అవమానిస్తూ ఇచ్చిన ట్వీట్‌ వివాదాస్పదం అయింది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిని

Hindu Goddess : కాళీ మాతను అవమానించిన ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ
Pictures in Ukraine Defence ministry tweet

న్యూఢిల్లీ : ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ కాళీ మాతను అవమానిస్తూ ఇచ్చిన ట్వీట్‌ వివాదాస్పదం అయింది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిని తొలగించాలని డిమాండ్ చేశారు. హిందూ ఫోబియాతో ఇటువంటి ట్వీట్లు ఇవ్వడం సరికాదని స్పష్టం చేశారు. దీంతో ఆ వివాదాస్పద ట్వీట్‌ను ఉక్రెయిన్ అధికారులు తొలగించారు.

ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ (Defense of Ukraine) ట్విటర్ హ్యాండిల్‌లో ఏప్రిల్ 30న ఇచ్చిన ట్వీట్‌లో, కాళీ మాతను అనుచిత రీతిలో ప్రదర్శించారు. భారీ పేలుడు వల్ల మంటలు, పొగలు కమ్ముకున్న పరిస్థితిలో మెడలో పుర్రెల మాలను ధరించి, నాలుక చాపుతూ ఆగ్రహంతో ఉన్నట్లు, స్కర్ట్ ఎగిరిపోతున్నట్లు కాళీ మాతను చిత్రీకరించారు. ఈ ఫొటో పక్కనే పేలుడు వల్ల ఏర్పడిన పొగ, మంటల చిత్రాన్ని పెట్టారు. అంతేకాకుండా కాళీ మాతను హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో (Marilyn Monroe)తో పోల్చారు. ఇది కళాఖండమని అభివర్ణిస్తూ పోస్ట్ చేశారు.

ఈ ట్వీట్‌ను పోస్ట్ చేసిన కాసేపటికే నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందూ ఫోబియా అని మండిపడ్డారు. కాళీ మాతను కోట్లది మంది పూజిస్తారని చెప్పారు. నటి మార్లిన్ మన్రోకు, కాళీ మాతకు తేడా తెలియడం లేదా? అని నిలదీశారు. ఓ ప్రొఫెసర్ ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశాన్ని అవమానించడానికే ఇటువంటి ట్వీట్ పెట్టారని మండిపడ్డారు. భారత దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం నేపథ్యంలోనే ఇలా జరిగిందన్నారు. దీనిని తీవ్రంగా ఖండించాలని, ఉన్నత స్థాయిలో నిరసన వ్యక్తం చేయాలని అన్నారు. దీంతో ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ట్వీట్‌ను డిలీట్ చేసింది.

ఇవి కూడా చదవండి :

Mann Ki Baat : ‘మన్ కీ బాత్’పై బిల్ గేట్స్ స్పందన

Mann Ki Baat : ఇతరుల మంచి లక్షణాలను ఆరాధిస్తా : ‘మన్ కీ బాత్’లో మోదీ

Updated Date - 2023-05-01T05:55:31+05:30 IST