Yogi Adityanath: డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో యూపీ గౌరవం పెరిగింది: సీఎం
ABN , First Publish Date - 2023-12-01T17:03:08+05:30 IST
డబుల్ ఇంజన్ ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశకత్వంలో రాష్ట్రంపై ఉన్న అభిప్రాయంలో మార్పు వచ్చిందని, ఈరోజు ప్రజలంతా యూపీని ఎంతో గౌరవంతో చూస్తున్నారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అన్నారు. అసెంబ్లీలో శుక్రవారంనాడు ఆయన మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న వారు అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చూపించేవారని విమర్శించారు.
లక్నో: డబుల్ ఇంజన్ ప్రభుత్వం (Double-engine government), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశకత్వంలో రాష్ట్రంపై ఉన్న అభిప్రాయంలో మార్పు వచ్చిందని, ఈరోజు ప్రజలంతా యూపీని ఎంతో గౌరవంతో చూస్తున్నారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ (Yogi Adityanath) అన్నారు. అసెంబ్లీలో శుక్రవారంనాడు ఆయన మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న వారు (Samajwadi party) అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చూపించేవారని, వారి తప్పదాలను ప్రజలు మరిచిపోరని చురకలు అంటించారు.
''గతంలో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం నాలుగు సార్లు అధికారంలో ఉంది. ఇవాళ యూపీ ప్రజల దృక్పథం మారింది. ఇది.. న్యూ ఇండియాకు న్యూ ఉత్తరప్రదేశ్. మన రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంటే అది విపక్ష సభ్యులకు కూడా సంతోషదాయకం కావాలి'' అని సీఎం అన్నారు. 2016-17లో ఉత్తరప్రదేశ్ జీఎస్‌డీపీ సుమారు రూ.13 లక్షల కోట్లు ఉండేదని, ఇవాళ 2023-24లో రూ.24.5 లక్షల కోట్లు ఉందని, రాష్ట్ర బడ్జెట్ కూడా పెరిగిందని చెప్పారు. దేశ మొత్తం జనాభాలో 16 శాతం మంది రాష్ట్రంలో నివసిస్తున్నారని, 2017 నుంచి యావరేజ్ బడ్జెట్ రెట్టింపు అయిందని చెప్పారు. ఇదే తరహా బడ్జెట్‌తో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని యోగి ఆదిత్యానాథ్ చెప్పారు.