Union Budget 2023 Live Updates: కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన.. రూ.7లక్షల వరకు పన్ను మినహాయింపు

ABN , First Publish Date - 2023-02-01T04:37:29+05:30 IST

కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్‌ డ్యూటీ 2.5శాతం తగ్గించింది. టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు భారీగా తగ్గనున్నాయి. వేతనజీవులకు కేంద్రం ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.7లక్షల వరకు పన్ను మినహాయింపును ఇచ్చింది..

Union Budget 2023 Live Updates: కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన.. రూ.7లక్షల వరకు పన్ను మినహాయింపు

12:24Pm

వేతనజీవులకు కేంద్రం ఊరట

ఆదాయ పన్ను పరిమితి పెంపు

రూ.7లక్షల వరకు పన్ను మినహాయింపు

ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను

రూ.7 నుంచి 9 లక్షల వరకు 5శాతం పన్ను

ఆదాయం రూ.30లక్షలు దాటితే 30శాతం పన్ను

Untitled-21524.jpg

12:20Pm

భారీగా పెరగనున్న టైర్లు, సిగరెట్ల ధరలు

వజ్రాలు, బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు

పెరగనున్న బ్రాండెడ్ దుస్తుల ధరలు

విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు ధర పెంపు

Untitled-1844.jpg

12:15Pm

పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు

భారీగా తగ్గనున్న టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు

టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్‌ డ్యూటీ 2.5శాతం తగ్గింపు

లిథియం బ్యాటీరీలపై 21 నుంచి 13శాతానికి కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపు

Untitled-1544.jpg

12:10Pm

సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ లిమిట్ రూ.15 నుంచి 30లక్షలకు పెంపు

63వేల సొసైటీల డిజిటలైజేషన్ కోసం రూ.2,516 కోట్లు కేటాయింపు

ప్రత్యామ్నాయ ఎరువుల అభివృద్ధికి రాష్ట్రాలకు

Untitled-13254.jpg

12:05Pm

ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విభాగం: నిర్మల

నిరుద్యోగుల కోసం పీఎం కౌశల్ పథకం

పీఎం కౌశల్ పథకం కింద 4లక్షల మందికి శిక్షణ

స్వదేశీ ఉత్పత్తుల అమ్మకానికి యూనిట్ మాల్స్

నీతి ఆయోగ్ మరో మూడేళ్లపాటు పొడిగింపు

దేశంలో 50 టూరిస్ట్ స్పాట్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

ప్రభుత్వ రంగంలో కాలం చెల్లిన వాహనాలను మార్చేందుకు ప్రత్యేక నిధులు: నిర్మల

Untitled-16000.jpg

11:50am

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం

నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్‌కు రూ.19,700 కోట్లు కేటాయింపు

విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు కేటాయింపు

దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌ల నిర్మాణం

5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌లు: నిర్మల

కొవిడ్ సమయంలో నష్టపోయిన MSMEలకు రిఫండ్ పథకం

నేషనల్ డేటా గవర్నెన్స్ ద్వారా సులభతర కేవైసీ

ఈ-కోర్టుల ప్రాజెక్ట్‌కు రూ.7వేల కోట్లు కేటాయింపు

వ్యాపార సంస్థలకు ఇకపై పాన్‌ కార్డు ద్వారానే గుర్తింపు

వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లింక్

చిరువ్యాపారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి: నిర్మల

Untitled-16000.jpg

11:47am

గిరిజన మిషన్‌ కోసం రూ.10వేల కోట్లు: నిర్మల

ఏడాదికి అర్బన్‌ ఇన్‌ ఫ్రా ఫండ్ కోసం రూ.10వేల కోట్లు

రూ.75వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గుర్తింపు కార్డు పాన్ నెంబర్

మేన్ ఇన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు: నిర్మల

Untitled-1544.jpg

11:37am

ఎస్టీ వర్గాలకు రూ.15 వేల కోట్లు కేటాయింపు: నిర్మల

రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు

రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు

వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయింపు

బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయింపు

Untitled-14000.jpg

11:30am

పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరింత ప్రోత్సాహం

గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు

ప్రాంతీయ భాషల్లో NBT ద్వారా మరిన్ని పుస్తకాలు

ఏకలవ్య పాఠశాలల్లో 38,800 టీచర్ల నియామకం

PMAY కోసం రూ.79వేల కోట్లు

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలతో పాటు 157 నర్సింగ్ కాలేజీలు : నిర్మల

Untitled-13254.jpg

11:25..AM

మహిళా సాధికారత దిశగా భారత్ కృషి చేస్తోంది: నిర్మల

హరిత ఇంధనం కోసం ప్రత్యేక చర్యలు

వ్యవసాయ రంగానికి రుణ, మార్కెటింగ్ సదుపాయం

గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోంది

దేశవ్యాప్తంగా 11.7కోట్ల టాయిలెట్స్‌ నిర్మించాం

2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నాం: నిర్మల

Untitled-1288.jpg

11:18AM

బడ్జెట్ ప్రసంగం పాయింట్స్

దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో ఉంది: నిర్మల

దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయి.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్.

ప్రస్తుత ఏడాదికి వృద్ధి రేటు 7శాతంగా అంచనా.

9 ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది.

102 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ అందించాం.

ఆత్మనిర్భర్ భారత్‌తో చేనేత వర్గానికి లబ్ధి చేకూరింది: నిర్మల

11:00 AM బడ్జెట్ ప్రవేశపెడుతున్న సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదవసారి కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

Untitled-1155.jpg

న్

10:45 AM పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మలమ్మ

బడ్జెట్ 2023-24 సమర్పణకు సమయం ఆసన్నమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకున్నారు.

10:40 AM రాష్ట్రపతితో నిర్మలా సీతారామన్ భేటీ

సాధారణ ఎన్నికలకు ముందు చిట్ట చివరి, పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (Draupadi Murmu)తో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రితోపాటు కేంద్ర మంత్రులు భగవత్ కిషన్‌రావ్ కరాద్, పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Untitled-1.jpg

10:31Am

అత్యధిక ద్రవ్యోల్బణం తెలంగాణలోనే

వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం తెలంగాణలోనే అత్యధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంటుకు సమర్పించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2022-23) ఆర్థిక సర్వేలో ఈ అంశాలను పేర్కొన్నారు.

Untitled-108.jpg

ఆ తర్వాత స్థానాల్లో బెంగాల్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, యూపీ.

ఇంధనం, వస్త్రాల ధరలే ప్రధాన కారణం ఆర్థిక సర్వేలో వెల్లడి.

10:20Am

తెలంగాణలో కొత్త రైళ్లు.. రైల్వే లైన్ల మంజూరుపై ప్రజల ఆశలు

కేంద్ర బడ్జెట్‌కు సన్నాహాలు పూర్తయ్యాయి. బుధవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ బడ్జెట్‌ పెట్టెలో తెలంగాణలో రైల్వే పనులకు మోక్షం కలిగించేలా వరాలున్నాయా? ఆదాయపరంగా టాప్‌లో ఉండే దక్షిణ మధ్య రైల్వేపై కేంద్రం కటాక్షం ఉంటుందా? ఈ ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో పెండింగ్‌ ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని ప్రజలు ఆశతో ఉన్నారు.

Untitled-965.jpg

గత బడ్జెట్‌లో రూ.3,048 కోట్లు

*2022-23 వార్షిక బడ్జెట్‌లో తెలంగాణకు రూ. 3,048 కోట్ల మేర కేటాయింపులు జరిగాయి. 2021-22 బడ్జెట్‌ కంటే ఇది 26% అధికం.

*చర్లపల్లి వద్ద శాటిలైట్‌ టెర్మినల్‌ నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నలిస్తూ..

2016లో రూ. 221 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించింది. 2021 బడ్జెట్‌లో రూ.50 కోట్లు, 2022లో రూ.70 కోట్లు కేటాయించారు.

10:10am

లోక్‌సభ టీవీలో కేంద్రబడ్జెట్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు..

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్ 2023 ను ప్రవేశపెట్టనున్నారు.(Finance Minister Nirmala Sitharaman)దేశ ప్రజలు ఫిబ్రవరి 1వతేదీన బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ టీవీలో కేంద్ర బడ్జెట్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.(Present Budget Today) ప్రజలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితోపాటు యూట్యూబ్ (YouTube),ట్విట్టర్ (Twitter) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా బడ్జెట్‌ను ప్రత్యక్షంగా చూడవచ్చు.వీక్షకులు ఇండియా బడ్జెట్ (www.indiabudget.gov.in)లో సెషన్‌ను కూడా చూడవచ్చు.

Untitled-854.jpg

10.05AM

గత బడ్జెట్‌ అంచనాలు.. వాస్తవాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Union Finance Minister Nirmala Sitharaman) బుధవారం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో.. గత బడ్జెట్‌ అంచనాలు, వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే..

2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థికాభివృద్ధి 9.2 శాతంగా ఉండబోతోందని గత బడ్జెట్‌లో నిర్మల అంచనా వేశారు.

Untitled-7555.jpg

ఆవాస్‌ యోజన కింద 2022-23లో దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 80 లక్షల గృహాలు నిర్మించాలని 2022-23 బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, నిర్మించినవి 40 లక్షలలోపు ఇళ్లే.

2022-23లో 3.8 కోట్ల ఇళ్లకు కుళాయిల ద్వారా తాగునీటి కల్పనకు బడ్జెట్‌లో రూ.600 కోట్లు ప్రతిపాదించారు. కానీ, వాస్తవంలో 1.7 కోట్ల ఇళ్లకే కుళాయి నీరు అందుబాటులోకి వచ్చింది.

10:00am

రైల్వే, హైవేల బడ్జెట్..

Railway and highways Budget : రూ. 4 లక్షల కోట్లు కేటాయింపు అంచనా.

రోడ్డు, రైల్వే మంత్రిత్వ శాఖలు రెండూ ఇప్పటి వరకూ ఖర్చు చేసిన దాన్ని బట్టి కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే గత ఏడాదితో పోలిస్తే 20-30% పెరుగుదల ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు కేంద్రం దాదాపు రూ.2 లక్షల కోట్లు కేటాయించింది.

రైల్వేల విషయానికొస్తే ప్రభుత్వం 2022-23కి గానూ.. రూ. 1.4 లక్షల కోట్లు కేటాయించింది.

9:50am

Stock Market : బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందే స్టాక్ మార్కెట్లు దూకుడు మీదున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా ఎగిసి పాజిటివ్ నోట్‌లో ప్రారంభమైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 106 పాయింట్లు లాభపడి 17,768 వద్ద కొనసాగుతోంది.

Untitled-554.jpg

9:45am

విశాఖ రైల్వే జోన్‌(Visakha Railway Zone) పట్టాలెక్కేనా

కేంద్రం నూతన బడ్జెట్‌ తీసుకువస్తోంది. ఈసారైనా విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ పనులకు తగిన నిధులు కేటాయిస్తుందో...లేదో చూడాలి. జోన్‌ ప్రకటించి నాలుగేళ్లయినా ఒక్క పని మొదలుకాలేదు. ‘తూర్పు కోస్తా రైల్వే జోన్‌’ అని నామకరణం చేశాక కేంద్ర కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మొన్న నవంబరులో అన్ని ఏర్పాట్లుచేసి ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు.

Untitled-654.jpg

కాశీ రైలు ఇప్పుడైనా ఇస్తారా?

విశాఖ నుంచి కాశీ (వారణాశి)కి రైలు ఇస్తామని చాలా కాలం క్రితమే హామీ ఇచ్చారు. కానీ ప్రతి బడ్జెట్‌లోను మొండిచేయి చూపిస్తున్నారు. ఈ బడ్జెట్‌లోనైనా ఆ హామీని పూర్తి చేయాల్సి ఉంది.

స్టీల్‌ ర్యాక్‌లు ఎప్పుడో...?

సరకు రవాణాలో వాల్తేరు డివిజన్‌ది అగ్రస్థానం. ర్యాక్‌ల కొరత వుందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నా..దీనిని అధికార వర్గాలు అంగీకరించడం లేదు. అవసరమైన మేర సర్దుబాటు చేస్తున్నామని అంటున్నారు.

9:35am

విజయవాడ స్టేషన్‌ ఆధునికీకరణ ఎప్పుడు..?

విజయవాడ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ అంశాన్ని అర దశాబ్దం కిందట ప్రకటించారు. ఇప్పటి వరకు స్టేషన్‌ రీ-డెవలప్‌మెంట్‌ జరగలేదు.

9852.jpg

9:24am

ఆశలు చిగురించేనా?

కేంద్ర బడ్జెట్‎లో హైదరాబాద్‎కు కేటాయింపులపై చర్చ..‘మెట్రో’కు రెండు దశ విస్తరణకు నిధులు వచ్చేనా?

Untitled-354.jpg

9:15am

2019 జనవరి 30న, అమరవీరుల దినోత్సవం నాడు, నిర్మలా సీతారామన్ రాజ్‌ఘాట్‌లో క్రీమ్ కలర్ మోడ్రాంగ్ ఫై ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన మణిపురి చీరను కట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో 20 రూపాయల నోటు రంగులో పచ్చని మంగళగిరి చీర..

Untitled-244.jpg

8:40am

నిర్మలా సీతారామన్ 17 డిసెంబర్ 2022న ఢిల్లీలోని జన్‌పథ్‌లో చేనేత హాత్‌ను సందర్శించి, చీరల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సౌత్ సిల్క్ చీర కట్టుకుని కనిపించారు.

8:10am

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందమైన చీరల సేకరణకు పెట్టిందిపేరు. ఆమె కట్టుకునే చీరల రంగులు దేశంలోని కరెన్సీ రంగులను పోలివుంటాయి. రూ.10 నుంచి రూ.2,000 నోట్ల రంగులను పోలివుండే చీరలను కట్టుకుని ఆమె పలు సందర్భాలలో కనిపిస్తుంటారు.

Untitled-265.jpg

అయితే ఈ రోజు ఆమె 2023-24 బడ్జెట్‌ను ఏ రంగు చీరతో వచ్చి సమర్పిస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. రూ.10 నుంచి రూ.2,000 నోట్ల రంగులను పోలివుండే చీరలను కట్టుకుని ఆమె పలు సందర్భాలలో కనిపిస్తుంటారు. ఆమె 2023-24 బడ్జెట్‌ను ఏ రంగు చీరతో వచ్చి సమర్పిస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.

సాధారణంగా కేంద్ర బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్నారంటే మార్కెట్‌లో ధరల సూచి ఆకాశాన్నంటుతుంది. సిగరెట్ల దగ్గర నుంచి కొన్ని రకాల వస్తువులు మాయమవుతాయి. కేంద్రం తీసుకునే కీలక నిర్ణయాలు, వరాలు పన్నులను ఊహించి ఇలా కొందరు వ్యాపారులు రెచ్చిపోతారు. ఈసారి వార్షిక బడ్జెట్‌ దాదాపు వచ్చే ఎన్నికల ముందు నాటిదే కావడం, ఆ మేరకు ఏం జరగబోతుందన్నదే ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ ఏర్పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే నిత్యావసరాలు, డీజిల్‌, పెట్రోలు, గ్యాస్‌ సిలిండర్‌తో సహా అనేక ధరలు దూసుకుపోయాయి.

పన్ను, పన్నేతర రంగాల్లోను కొంత మేర అస్పష్టతే ఉంది. కేంద్రం తీసుకునే కొన్ని విధాన నిర్ణయాలు, బడ్జెట్‌ సారాంశం రాష్ట్రాలపై పొడచూపనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర వార్షిక బడ్జెట్‌ సమతూకంగా ఉండేలా జాగ్రత్త పడతారని కొందరు, లేదా రైల్వేలను, మరికొన్ని ముఖ్య విభాగాల్లో నిధుల కోత ఉంటుందా ? అనే సందేహం లేకపోలేదు. అత్యధికులు మాత్రం నిర్మలమ్మా.. కనికరించమ్మా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆదాయపు పన్ను పరిమితిని ఐదు లక్షల వరకు పెంచాలన్న డిమాండ్‌ మూడేళ్ళుగా కొనసాగుతోంది. కేంద్ర బడ్జెట్‌ ముందు వేతన జీవులు, ఇతర రంగాలకు చెందిన వారంతా ఇదే డిమాండ్‌ను పదే పదే కేంద్రం దృష్టికి తీసుకు వస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతుల రూపంలో నివేదిస్తున్నారు. బడ్జెట్ 2023లో అయినా ఇది నిజం కావాలని వేతన జీవులు ఆశిస్తున్నారు.

2019లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు పెట్టబోతున్న ఆఖరు బడ్జెట్‌ ఇదే! వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ఈసారి పన్నుమోత నుంచి కొంతైనా ఉపశమనం దొరుకుతుందని సామాన్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆదాయపన్ను పరిమితి పెంపు, కొన్నిరకాల వస్తు, సేవల పన్ను శాతాల తగ్గింపు వంటివాటిని నిర్మల ప్రకటిస్తారని, తమకు ఊరట కలిగిస్తారని బీజేపీకి అత్యంత కీలకమైన ఓటుబ్యాంకుగా ఉన్న మధ్య, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2023-02-01T14:29:46+05:30 IST