Congress Vs BJP : ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఘాటు స్పందన

ABN , First Publish Date - 2023-08-15T16:55:50+05:30 IST

నరేంద్ర మోదీ వచ్చే ఏడాది తన ఇంట్లో జాతీయ జెండాను ఎగురవేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. 2014 ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ ఈ విధంగానే చెప్పిందని, అయినప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు.

Congress Vs BJP : ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఘాటు స్పందన
Anurag Thakur, Mallikharjun Kharge

న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ వచ్చే ఏడాది తన ఇంట్లో జాతీయ జెండాను ఎగురవేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress chief Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ (Union minister Anurag Thakur) ఘాటుగా స్పందించారు. 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ ఈ విధంగానే చెప్పిందని, అయినప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మంగళవారం ఎర్ర కోట నుంచి ప్రసంగించారు. వచ్చే ఏడాది జరిగే స్వాతంత్ర్య దినోత్సవాల్లో తన ప్రభుత్వ విజయాలను ఎర్ర కోట ప్రసంగంలో ప్రజలకు వివరిస్తానని చెప్పారు. అంటే 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో తిరిగి ఎన్డీయే విజయం సాధిస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ, ‘‘ఆయన (మోదీ) వచ్చే ఏడాది మళ్లీ జాతీయ జెండాను ఎగురవేస్తారు, ఆ పనిని ఆయన తన ఇంట్లో చేస్తారు’’ అన్నారు.

ఖర్గే వ్యాఖ్యలను అనురాగ్ ఠాకూర్ ఖండించారు. ‘‘కాంగ్రెస్ 2014 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే చెప్పింది, కానీ మేం సంపూర్ణ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చాం. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ ఇదే విధంగా చెప్పింది, కానీ ప్రధాని మోదీ మళ్లీ సంపూర్ణ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చారు. ప్రధాని మోదీకి ఓట్లు రావడానికి ప్రాతిపదిక కాంగ్రెస్ చెప్పే మాటలు కాదు’’ అన్నారు.


కాంగ్రెస్ పార్టీ గతంలో మోదీని మృత్యు బేహారి అని విమర్శించిందని అనురాగ్ గుర్తు చేశారు. బీజేపీకి ఓటు వేసేవారు రాక్షస ప్రవృత్తిగలవారని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు రాక్షసులుగా పరిగణించేవారిని తాము దేవుళ్లుగా చూసుకుంటామని చెప్పారు. ఆ దేవుళ్లు (ఓటర్లు) నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన బిడ్డను ప్రధాన మంత్రి పదవి చేపట్టే విధంగా ఆశీర్వదించారని చెప్పారు. ఘమండియా కూటమి అహంకారాన్ని మరోసారి ప్రజలు చిత్తు చేస్తారన్నారు.

కాంగ్రెస్, జేడీయూ, డీఎంకే, ఆప్, టీఎంసీ వంటి 26 పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన కూటమికి ఇండియా (I.N.D.I.A) అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కూటమిని ఘమండియా కూటమి అని బీజేపీ ఎద్దేవా చేస్తోంది.


ఇవి కూడా చదవండి :

Independence Day : మణిపూర్ రాష్ట్రానికి అండగా యావద్భారతావని : మోదీ

Independence Day : మధ్య తరగతి, మహిళల నేతృత్వంలో అభివృద్ధి : మోదీ

Updated Date - 2023-08-15T16:55:50+05:30 IST