Union Minister: ఎయిమ్స్‏ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పేసిన మంత్రి

ABN , First Publish Date - 2023-05-30T13:39:38+05:30 IST

మదురైలో ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణం 2026లోగా పూర్తవుతుందని కేంద్ర సైన్స్‌, సాంకేతిక శాఖ మంత్రి జితేందర్‌సింగ్‌(Jitender Singh), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అ

Union Minister: ఎయిమ్స్‏ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పేసిన మంత్రి

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మదురైలో ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణం 2026లోగా పూర్తవుతుందని కేంద్ర సైన్స్‌, సాంకేతిక శాఖ మంత్రి జితేందర్‌సింగ్‌(Jitender Singh), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సంయుక్తంగా ప్రకటించారు. బీజేపీ బలోపేతంపై చర్చించేందుకు సోమవారం ఉదయం చెన్నైకి విచ్చేసిన కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌.. స్థానిక అడయార్‌లోని ఓ హోటల్లో పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లపాటు ప్రజలకు సుపరిపాలన అందించిందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ దేశం ముందంజలో ఉందని, నగరాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరిచిందన్నారు. 15 నగరాల్లో మెట్రో రైల్వే సేవలు ప్రారంభించిందని వివరించారు. కొత్తగా దేశంలో 700 వైద్య కళాశాలలు ప్రారంభించిందని, రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలకు కేంద్రం అనుమతినిచ్చిందని తెలిపారు. 2026లోగా మదురై(Madurai)లోని ఎయిమ్స్‌ ఆసుపత్రి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీని పటిష్ఠం చేసే దిశగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. గ్రామస్థాయి నుండి నగరస్థాయి వరకు బహిరంగ సభలు నిర్వహించనున్నామని, ఇంటింటికీ వెళ్ళి కరపత్రాలను పంపిణీ చేయనున్నామని తెలిపారు.

Updated Date - 2023-05-30T13:43:11+05:30 IST