Rajnath Singh: నేడు చెన్నైకి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

ABN , First Publish Date - 2023-06-20T08:38:15+05:30 IST

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌(Union Defense Minister Rajnath Singh) మంగళవారం చెన్నై రానున్నారు. ప్రధానమంత్రి నరేం

Rajnath Singh: నేడు చెన్నైకి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

ఐసిఎఫ్‌(చెన్నై): కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌(Union Defense Minister Rajnath Singh) మంగళవారం చెన్నై రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, పోలింగ్‌ బూత్‌ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 10న రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోమంత్రి అమిత్‌షా దక్షిణ చెన్నై నియోజకవర్గ పోలింగ్‌బూత్‌ కమిటీతో భేటీ అయ్యారు. అనంతరం వేలూరు లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మంగళవారం తాంబరంలో జరగనున్న బహిరంగసభలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి వస్తున్నట్లు పార్టీ తెలిపింది.

Updated Date - 2023-06-20T08:38:17+05:30 IST