Yogi Prayer RaM Lalla: రామ్ లల్లాకు యోగి ప్రత్యేక పూజలు, పీఎం పర్యటన ఏర్పాట్లు తనిఖీ
ABN , Publish Date - Dec 29 , 2023 | 07:12 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో ఈనెల 30న పర్యటించనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ ఏర్పాట్లను శుక్రవారంనాడు స్వయంగా పర్యవేక్షించారు. తొలుత రామ్ లల్లా, హనుమాన్‌గడీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు.
అయోధ్య: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అయోధ్యలో ఈనెల 30న పర్యటించనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఆ ఏర్పాట్లను శుక్రవారంనాడు స్వయంగా పర్యవేక్షించారు. తొలుత రామ్ లల్లా, హనుమాన్‌గడీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ప్రధాని పాల్గొనే ర్యాలీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వయంగా ఆయన సెల్ఫీ దిగారు.
అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్
ప్రధానమంత్రి అయోధ్య పర్యటనలో భాగంగా అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. కొత్త అమృత్ భారత్, వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. అయోధ్య థామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ను రూ.240 కోట్లతో అభివృద్ధి పరిచారు. మూడు అంతస్తుల మోడ్రన్ రైల్వే స్టేషన్ భవంతితో పాటు లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, పూజాసామగ్రి దుకాణాలు, క్లాక్ రూమ్స్, చైల్డ్ కేర్ గదులు, వెయిటింగ్ హాల్స్ వంటి అధునాత వసతులు ఏర్పాటు చేశారు. దీనితో పాటు కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రాయాన్ని కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో రూ.15,700 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం, కొత్త ప్రారంభోత్సవాలు చేస్తారు.