Uttarpradesh: అంటువ్యాధులు ప్రబలకుండా యోగీ సర్కార్ చర్యలు.. స్టూడెంట్స్ ఫుల్ షర్ట్స్ వేసుకోవాల్సిందే
ABN , First Publish Date - 2023-09-22T21:32:05+05:30 IST
వర్షాకాలం(Monsoon) కావడంతో ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. అంటు వ్యాధుల్ని(Viral Infections) అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు
ఉత్తర్ ప్రదేశ్: వర్షాకాలం(Monsoon) కావడంతో ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. అంటు వ్యాధుల్ని(Viral Infections) అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. డెంగ్యూ(Dengue)తో పాటు అనేక అంటువ్యాధుల కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రాథమిక (1 నుండి 5వ తరగతి), ప్రాథమికోన్నత (6 నుండి 8వ తరగతి) విద్యార్థులకు జాగ్రత్తలు చెబుతూ పాఠశాల(Schools)కు వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించింది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి ప్యాంటు, ఫుల్ స్లీవ్ షర్టులు ధరించేలా చూడాలని స్పష్టం చేసింది.
చేసింది. స్కూల్ ఆవరణలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పింది. నోడల్ టీచర్లు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్(Educational Director) మహేంద్ర దేవ్ అన్ని జిల్లాల ప్రాథమిక విద్యాశాఖ అధికారులకు లేఖ రాశారు. అక్టోబర్ 3 నుంచి ప్రారంభమయ్యే అంటువ్యాధుల నియంత్రణ ప్రచారంలో పాల్గొనాలని సూచించింది.
పాఠశాలల్లో వైద్య పరీక్షలు, చికిత్స
విద్యార్థులు జ్వరం(Fever) తదితర వ్యాధులతో బాధపడుతుంటే సకాలంలో వైద్య పరీక్షలు(Medical Tests) అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. డెంగీ, మలేరియా అనుమానితులు ఉంటే వారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులకు స్పష్టం చేసింది.