UP elections: యూపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిన సీఎం యోగి
ABN , First Publish Date - 2023-05-04T09:11:33+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ సాయుధ పోలీసుల పహరా మధ్య గురువారం ఉదయం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.....
గోరఖ్‌పూర్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ సాయుధ పోలీసుల పహరా మధ్య గురువారం ఉదయం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గోరఖ్‌పూర్(Gorakhpur)మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.(CM Yogi casts his vote)పట్టణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం యోగి పిలుపునిచ్చారు.మున్సిపాలిటీల సాధికారత కోసం తప్పక ఓటు వేయండి అని సీఎం యోగి ట్వీట్ చేశారు. యూపీలోని 37 జిల్లాల్లో మొదటి విడత అర్బన్ మున్సిపల్ ఎన్నికల్లో(UP urban body elections) 7,593 మంది ప్రతినిధులను ఎన్నుకోనున్నారు.
ఇది కూడా చదవండి: Encounter: జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల హతం
2.4కోట్ల మంది ఓటర్ల కోసం 7,362 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.మొదటి విడతగా 10 మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది.షామ్లీ, రాంపూర్, మొరాదాబాద్, సంభాల్, ఆగ్రా, ఫిరోజాబాద్, మధుర, మెయిన్ పురి, జలౌన్, లలిత్ పూర్, ప్రయాగరాజ్, లఖింపూర్ ఖేరి,వరణాసి, గోరఖ్ పూర్, మహారాజ్ గంజ్, గోండా, ఘాజీపూర్ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సాగుతోంది. ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు కోసం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు. మే 13వతేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.