Share News

Uttarakashi tunnel rescue: కార్మికులను పరామర్శించి రిలీఫ్ చెక్కులను అందించిన సీఎం

ABN , First Publish Date - 2023-11-29T15:22:47+05:30 IST

ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 41 మంది కార్మికులను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బుధవారంనాడు పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు.

Uttarakashi tunnel rescue: కార్మికులను పరామర్శించి రిలీఫ్ చెక్కులను అందించిన సీఎం

ఉత్తరకాశి: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ (Uttarakashi tunnel rescure) ఆపరేషన్ విజయవంతమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 41 మంది కార్మికులను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar singh Dhami) బుధవారంనాడు పరామర్శించారు. కమ్యూనిటీ హెల్త్ కేర్‌ సెంటర్‌లో వీరికి చికిత్స అందిస్తున్నారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి వారికి ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఆసుపత్రి ఖర్చులన్నీ తామే భరిస్తామని కూడా చెప్పారు. మెడికల్ అబ్జర్వేషన్‌లో ఉంచి పూర్తిగా కోలుకున్న తర్వాత వారిని సురక్షితంగా ఇంటికి పంపిస్తామని భరోసా ఇచ్చారు.


ప్రధానికి కృతజ్ఞతలు

రెస్క్యూ ఆపరేషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సహాయసహకారాలు అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భౌక్‌నాగ్ ఆలయం ముఖద్వారాన్ని పునర్నిర్మించి, నిర్మాణంలో ఉన్న టన్నెల్‌ పనులను సైతం పునఃసమీక్షిస్తామని చెప్పారు. టన్నెల్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు కూడా ఆయన తెలిపారు.


కార్మికులకు మోదీ అభినందనలు

కాగా, ప్రధానమంత్రి సైతం రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసిందని, కార్మికులు చూపించిన ధైర్యం ప్రశంసనీయమని, వారికి కొత్త జీవితం లభించిందని అన్నారు. టన్నెల్‌ నుంచి బయటపడిన కార్మికులతో ప్రధాని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలతో పాటు రెస్క్యూ బృందాలు చేసిన కృషిని ప్రధాని ప్రశంసించారు. టన్నెల్ నుంచి సురక్షితంగా బయటపడిన 41 మంది కార్మికులలో 15 మంది జార్ఖండ్, ఐదుగురు బీహార్, ముగ్గురు పశ్చిమబెంగాల్, 8 మంది ఉత్తరప్రదేశ్, ఐదుగురు ఒడిశా, ఇద్దరు అసోం, ఒకరి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వారున్నారు.

Updated Date - 2023-11-29T15:22:48+05:30 IST