Tripura: ఎన్నికల ప్రకటన వెలువడగానే త్రిపురలో ఘర్షణలు
ABN , First Publish Date - 2023-01-18T19:33:08+05:30 IST
త్రిపురలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ బుధవారంనాడు ప్రకటించిన.. అరగంటకే కాంగ్రెస్, బీజేపీ
అగర్తలా: త్రిపుర (Tripura)లో హింసాత్మక ఘర్షణలు (Violent Clash) చోటుచేసుకున్నాయి. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల తేదీని ఎన్నికల కమిషన్ బుధవారంనాడు ప్రకటించిన అరగంటకే కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల మధ్య మజలిస్‌పుర (Majlishpur) నియోజకవర్గంలోని రనిర్‌బజార్ మెహన్‌పూర్‌లో ఘర్షణ తలెత్తింది. ఈ గొడవల్లో కాంగ్రెస్ నేత డాక్టర్ అజయ్ కుమార్ సైతం గాయపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలు పలువురు గాయపడ్డారని, వారంతా రనిర్‌బజార్ పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారని, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున ఆ ప్రాంతంలో ఉండటంతో క్షతగాత్రులు ఆసుపత్రికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్ చెప్పారు. విపక్షాలపై దాడి వెనుక ఒక మంత్రి ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. మజ్‌లిస్‌పూర్ నియోజకవర్గంతో సహా ఐదు నియోజకవర్గాల్లో సెపరేట్‌గా ఎన్నికలను ఈసీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.