Home » Tripura
కొన్ని గంటల వ్యవధిలోనే త్రిపురలో మరో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటన చోటు చేసుకుంది. దక్షిణ త్రిపుర జిలాల్లో పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఐదవ తరగతి విద్యార్థినిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
దశాబ్దాల సాయుధ పోరాటానికి స్వస్తి పలుకుతూ త్రిపురలో రెండు తిరుగుబాటు గ్రూపులు జన జీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించాయి.
పొరుగున్న బంగ్లాదేశ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అంతలో ఆ ఇంటిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భారత్ వ్యక్తి అనుమతి లేకుండా తమ దేశంలో అడుగు పెట్టడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడిపై కేసు నమోదు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అతడిని జైలు నుంచి విడుదల చేయలేదు. మరో 26 ఏళ్ల తమ కస్టడీలోనే ఉంచారు. దాంతో 37 ఏళ్లు బంగ్లా జైల్లో మగ్గిన అతడు తాజాగా విడుదలై.. భారత్‌లోని స్వగ్రామంలో ఇంటికి చేరుకున్నాడు.
తెలంగాణ కొత్త గవర్నర్‌గా నియమితులైన త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే నూతన గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 23 మంది బంగ్లాదేశీయులను ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం వీరంతా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించారు. ఆ క్రమంలో అస్సాం వెళ్లేందుకు వీరు అగర్తలా రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్(Remal Cyclone) కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.
బంగాళాఖాతంలో ఉద్భవించిన రెమాల్ తుపాను(Remal Cyclone) ఆదివారం రాత్రి బెంగాల్ తీరాన్ని తాకింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బలమైన గాలులు వీచిన కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకొరిగాయి. తుపాను కారణంగా కోల్‌కతా, నార్త్ 24 పరగణాలతో సహా పశ్చిమ బెంగాల్‌లోని ఇతర నగరాల్లో భారీ వర్షం కురిసింది.
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. త్రిపురలో బుధవారం మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేదని వివరించారు. కాంగ్రెస్ అనుసరించే ‘లూట్ ఈస్ట్ పాలసీ’లో లూట్.. దోపిడీ ఉందని సెటైర్లు వేశారు. తమది యాక్ట్ ఈస్ట్ పాలసీ అని, చెప్పింది చేస్తాం అని ప్రధాని మోదీ వివరించారు.
ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ త్రిపురకు(Tripura) చెందిన 700 మంది ప్రభుత్వ ఉద్యోగులు సుప్రీంకోర్టు(Supreme Court) తలుపు తట్టారు. త్రిపురకు చెందిన 700 మంది అండర్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం 2017, 2020లో తొలగింపు ఉత్తర్వులు ఇచ్చింది.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలహలం మొదలైంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను సైతం ప్రకటించి.. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సినీ రంగంతో పాటు.. రాజ కుటుంబానికి చెందిన వ్యక్తులకు వివిధ పార్టీలు సీట్లు కేటాయిస్తున్నాయి.