బీజేపీ ఎమ్మెల్యే అంతమాట అనేశారేంటి..!
ABN , First Publish Date - 2023-03-18T11:38:53+05:30 IST
రాష్ట్రంలో బీజేపీ మళ్ళీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తే మదరసాలన్నింటినీ మూసివేస్తామని వాటిని ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేస్తామని బీజే
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ మళ్ళీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తే మదరసాలన్నింటినీ మూసివేస్తామని వాటిని ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్(BJP MLA Basanagowda Patil Yatnal) ప్రకటించారు. బెళగావిలో గురువారం జరిగిన బీజేపి విజయ సంకల్పయాత్రలో పాల్గొని ప్రసంగించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మదరసాలలో కేవలం మతపరమైన విద్యను మాత్రమే బోధిస్తుంటారని దీని వల్ల దేశానికి సమాజానికి దమ్మిడీ ప్రయోజనం లేదన్నారు. మదసరాలను మూసి వేసి వాటిని ప్రభుత్వ పాఠ శాలల్లో విలీనం చేసే ప్రక్రియ బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, అస్సోం, గుజ రాత్‌లలో ప్రారంభమైందని కర్ణాటక(Karnataka)లోనూ దీన్ని అమల్లోకి తెస్తామన్నారు. ముస్లింలు తమ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లుగా చూడాలని కలలు కనాలే తప్ప మతోన్మాదులుగా కాదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అసమ్మతి ఎమ్మెల్యేగా ముద్రపడిన యత్నాళ్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం విశేషం. ఎన్నికల ముంగిట ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి మేలుకంటే చేటు ఎక్కువ కలిగిస్తాయని నేతలు పేర్కొన్నారు.