Rajnath singh: సముద్రంలో దాక్కున్నా వదలం.. రక్షణ మంత్రి వార్నింగ్..
ABN , Publish Date - Dec 26 , 2023 | 06:22 PM
భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకల పై వరుస డ్రోన్ దాడులు జరుగుతుండటంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీరియస్ అయ్యారు. దాడులకు పాల్పడిన వారిని సముద్రంలో దాక్కునా వేటాడి మరీ పట్టుకుంటామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ముంబై: భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకల (Merchant Navy ships)పై వరుస డ్రోన్ దాడులు (Drone Attacks) జరుగుతుండటంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) సీరియస్ అయ్యారు. దాడులకు పాల్పడిన వారిని సముద్రంలో దాక్కునా వేటాడి మరీ పట్టుకుంటామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాణిజ్య నౌకలు ఎంవీ కెమ్ ప్లూటో (MV Chem Pluto), ఎంవీ సాయి బాబా (MV Sai Baba)లపై ఇటీవల జరిగిన దాడులను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. సముద్ర జలాల్లో గస్తీని ముమ్మరం చేసినట్టు తెలిపారు. ముంబై వేదికగా యుద్ధనౌక ఐఎన్ఎస్ ఇంఫాల్ (INS Imphal)ను నౌకాదళంలో మంగళవారంనాడు ప్రవేశపెట్టిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ ఈ హెచ్చరికలు చేశారు.
ఈనెల 23న గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ''ఎంపీ కెమ్ ప్లూటో''పై డ్రోన్ దాడి జరగడం సంచలనమైంది. 21 మంది భారత నౌకా సిబ్బందితో ఉన్న ఈ నౌక పోర్‌బందర్‌కు 217 నాటికల్ మైల్స్ దూరంలో ఆగిపోవడంతో భారత నౌకాదళం వెంటనే సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ఐసీజీఎస్ విక్రమ్ రక్షణలో ఆ నౌకను ముంబై పోర్టుకు చేరింది. ఈ దాడి ఇరాక్ భూభాగం నుంచి జరిగిందని అమెరికా రక్షణ శాఖకు చెందిన పెంటగాన్ సంచలన ప్రకటన చేయగా, దీనిని ఇరాక్ ఖండించిది. దీనికి ముందు ఎంవీ సాయిబాబా వాణిజ్య నౌకపై కూడా దాడి జరిగింది. కాగా, మర్చెంట్ షిప్‌లపై కౌంటర్ పైరసీ, డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు నాలుగు డిస్ట్రాయర్లను మోహరించినట్టు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.రవికుమార్ తెలిపారు.