Yogi Adityanath: యూపీ సీఎం యోగిని చంపుతాను...టోల్ ఫ్రీ నంబరుకు ఆగంతకుడి ఫోన్ కాల్
ABN , First Publish Date - 2023-04-25T09:34:34+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు ప్రాణహాని ఉందని ఆ రాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్...
లక్నో(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు ప్రాణహాని ఉందని ఆ రాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఎటిఎస్) మంగళవారం కేసు నమోదు చేసింది.(Yogi Adityanath) ఓ గుర్తుతెలియని కాలర్ పోలీసు టోల్ ఫ్రీ నంబర్ 112కి ఫోన్ చేసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హతమారుస్తామని బెదిరించారు.(Death Threat)గుర్తుతెలియని కాలర్‌పై కేసు నమోదు చేశామని(Case Registered) యూపీ ఏటీఎస్ తెలిపింది.
ఇది కూడా చదవండి : Ex boyfriend: మాజీ ప్రియుడికి ప్రేయసి షాక్...పెళ్లి సందర్భంగా ఏం చేసిందంటే...
సాక్షాత్తూ సీఎం యోగికి బెదిరింపుతో యూపీ యాంటీ టెర్రర్ స్క్వాడ్ అప్రమత్తమైంది.గుర్తుతెలియని కాలర్ యూపీ పోలీసుల సోషల్ మీడియా డెస్క్‌కు కూడా మెసేజ్ చేశాడు.‘‘సీఎం యోగికో జల్దీ మార్ దుంగా’’ (త్వరలో సీఎం యోగిని చంపుతాను) అని యూపీ రాష్ట్ర పోలీసులు చెప్పారు.