good night sleep: నిద్రలేమి సమస్య రోజు రోజుకీ పెరుగుతుంటే.. ఇలా చేయండి.!

ABN , First Publish Date - 2023-04-29T13:18:20+05:30 IST

నిద్రవేళకు ముందు అరటిపండ్లు, గుమ్మడి గింజలు లేదా బాదం లేదా చమోమిలే టీ వంటి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది

good night sleep: నిద్రలేమి సమస్య రోజు రోజుకీ పెరుగుతుంటే.. ఇలా చేయండి.!
Hydration

నిద్రలేమి సమస్యతో ఇప్పటి రోజుల్లో ఎందరో బాధపడుతున్నారు. మన జీవనశైలి మార్పులతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. నిద్రలేమి ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు అసమతుల్యత, తక్కువ రోగనిరోధక శక్తి, అలసట, ఇలాంటి అనేక ఇతర శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. రాత్రి నిద్ర ప్రశాంతంగా ఉంటే రోజు బాగా గడుస్తుంది. ఉత్సాహంగా ఉంటారు.రోజులో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని, సరైన నిద్రకు సహాయపడటానికి మీ జీవనశైలిలో చేయవలసిన మార్పుల జాబితా:

1. వ్యాయామం చేయడం

శారీరక వ్యాయామం చేయడం అత్యంత సాధారణ ప్రభావవంతమైనది. వ్యాయామం శరీరాన్ని అలసిపోయేలా చేస్తుంది. మంచి నిద్ర పొందడానికి కండరాల మానసిక ఒత్తిడిని విడుదల చేస్తుంది.

2. హైడ్రేషన్

రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. వీలైనంత ఎక్కువ ద్రవాలను తీసుకోవాలి.

3. ఉదయం సూర్యరశ్మి

15 నుంచి 20 నిమిషాల ఉదయం సూర్యరశ్మి తగిలేలా కూర్చుంటే, విటమిన్ డి అందుతుంది..

ఇది కూడా చదవండి: ఫ్రెంచ్ ఫ్రైస్ మీ ఆందోళనను, డిప్రెషన్‌ను మరింత తీవ్రతరం చేస్తుందా..?

4. ఆహార అలవాట్లు

నిద్రవేళకు ముందు అరటిపండ్లు, గుమ్మడి గింజలు లేదా బాదం లేదా చమోమిలే టీ వంటి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది.. బాదం, వాల్‌నట్‌లు, పిస్తాలు, జీడిపప్పు వంటి గింజలను తినడం వల్ల కూడా ఆరోగ్యకరమైన నిద్ర వస్తుంది.

5. భోజనం సమయం

నిద్రవేళకు మూడు గంటల ముందు చివరి భోజనం తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల అన్నం తినడానికి ముందే జీర్ణం అవుతుంది.

Updated Date - 2023-04-29T13:18:20+05:30 IST