Fragrances in soap: సబ్బులోని సువాసనలు మిమ్మల్ని దోమలకు మరింత ఆకర్షణీయమైన లక్ష్యంగా చేస్తాయి.

ABN , First Publish Date - 2023-05-12T13:05:15+05:30 IST

దోమకాటుకు గురికాకుండా ప్రత్యామ్నాయాలను వెతకడం మంచిది.

Fragrances in soap: సబ్బులోని సువాసనలు మిమ్మల్ని దోమలకు మరింత ఆకర్షణీయమైన లక్ష్యంగా చేస్తాయి.
soap

మలేరియా, డెంగ్యూ జ్వరం, జికా వైరస్, వెస్ట్ నైల్ వైరస్ వంటి వ్యాధులను దోమలు వ్యాపింపజేస్తాయి. కాబట్టి దోమల కాటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. తరచుగా వెచ్చని వాతావరణం , పెరిగిన తేమతో సమానంగా ఉంటుంది.

అందువల్ల మనం వాడే సువాసన గల సబ్బుల ద్వారా కూడా దోమలు మనల్ని కుట్టే ప్రమాదం ఉందని ఈమధ్య జరిగిన పరిశోధనల్లో తెలిపింది. దోమల సీజన్ లో తీసుకునే జాగ్రత్తల కారణంగా కాస్త దోమకాటు ప్రమాదం తగ్గినా చాలావరకూ మనం వాడే ఒంటి సబ్బుల సువాసనకు కూడా దోమకాటుకు గురవుతామట. కొత్త అధ్యయనం వర్జీనియా పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్, స్టేట్ యూనివర్శిటీ మనం ఉపయోగించే సబ్బుల వల్ల కూడా దోమకాటుకు గురవుతామని తేల్చింది. నిజానికి సువాసన గల సబ్బులను మారుస్తూ వాడుతూనే ఉంటాం. అదో కొత్త ఫీల్ ఇస్తుందని నమ్ముతాం. చాలా మంది వ్యక్తులు తరచుగా వాడుతున్న సువాసన గల సబ్బుల గురించి జరిగిన పరిశోధనలో తేలిందేమంటే..

రక్తాన్ని తాగే ఆడ దోమలు మనం ఉపయోగించే సబ్బు వాసనలతో పసిగడతాయట. అంతే కాదు మనలోని కార్బన్ డయాక్సైడ్‌తో సహా అనేక ఇంటర్‌మోడల్ సూచనల ఆధారంగా దోమలు ప్రజలను ఆకర్షిస్తాయి. దోమలు మన శ్వాస, మన చర్మపు మైక్రోబయోడేటా ద్వారా ఉత్పత్తి చేయబడిన అస్థిరతలు, వాసన సంకేతాలు ఇలా మనం ధరించే దుస్తుల విషయంలో కూడా అవి ఆకర్షితమవుతాయి.

ఇది కూడా చదవండి: పచ్చ సొన తింటే కొవ్వు పెరుగుతుందా.. గుండెకు మంచిది కాదా..? ఒకటి మాత్రం నిజం..!

వీటికి విరుగుడుగా కొబ్బరి ఉత్పత్తులను వాడితే రక్తాన్ని తాగే దోమలపై వికర్షక ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి, దోమ కాటుకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే, ఈ మార్గాన్ని ప్రయత్నించండి.

సబ్బులలో లిమోనీన్ సువాసన దోమలపై వికర్షక ప్రభావాన్ని చూపుతుంది. అయినప్పటికీ, మనకు నచ్చిన సువాసనగల సబ్బును వాడుతూనే దోమకాటుకు గురికాకుండా ప్రత్యామ్నాయాలను వెతకడం మంచిది.

Updated Date - 2023-05-12T13:05:15+05:30 IST