Pregnancy-Papaya: బొప్పాయి పండ్లు తింటే నిజంగానే అబార్షన్ అవుతుందా..? గర్భిణులు వీటిని తింటే జరిగేదేంటంటే..!
ABN , First Publish Date - 2023-06-17T14:46:31+05:30 IST
బొప్పాయిలోని విటమిన్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి,
కొన్ని పండ్లలాగే బొప్పాయి పండు కూడా, ఇది కాలంతో పనిలేకుండా మార్కెట్ లోకి వచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చే బొప్పాయి ఒకటి. చిన్నా పెద్దా అందరూ ఈ బొప్పాయి పండు తినడానికి ఇష్టపడతారు. నీరసంగా ఉన్నా, రక్తం లేకపోయినా బొప్పాయి పండు తినాలని డాక్టర్స్ చెబుతూ ఉంటారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయి తింటే అది చేటు చేస్తుందనే అపోహ మనలో చాలామందికి ఉన్నదే. ఇదే విషయంలో మరికొంత సమచారం తెలుసుకుందాం.
మామూలుగా ఈ సమయంలో ఏం తినాలి, ఏమి తినకూడదు అనేది గర్భధారణలో ఆ తొమ్మిది నెలలకు అత్యంత ముఖ్యమైన ప్రశ్న. మా తాతలు, తల్లిదండ్రులు గర్భధారణ సమయంలో కొన్ని ఆహారాలు తినకూడదని మాకు సలహా ఇచ్చారు, అని అంటూ ఉంటారు. గర్భస్రావానికి కారణమయ్యే ఆహారాలలో బొప్పాయి ఒకటిని వారి అభిప్రాయం.
బొప్పాయిలో అనేక ఔషదగుణాలున్నాయి. ముఖ్యంగా ఈ పండులోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఈ బొప్పాయి పండుని తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తుందనే ఆపోహకు సంబంధించి చెప్పాలంటే ప్రెగ్నెన్సీలో బొప్పాయి తింటే ఫర్వాలేదు, కానీ బొప్పాయి కాయ పండి పక్వానికి రావాలి, అలా రాని దానిని తింటే అది గర్భస్రావానికి దారి తీస్తుంది. అలాగే పీరియడ్స్ ఆలస్యం అయినప్పుడు రావడానికి ఒక కప్పు బొప్పాయిని తీసుకోవచ్చు. కానీ ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే, తల్లి కాబోయే స్త్రీ పోషకాహారం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం వల్ల ఇది అభివృద్ధి చెందుతున్న పిండంపై నేరుగా ప్రభావం చూపుతుంది.
గర్భధారణ సమయంలో బొప్పాయి తినవచ్చా?
1. పండిన బొప్పాయి తినడం మంచిది. గర్భధారణకు ప్రయోజనం, కానీ పండని సగం పండిన బొప్పాయి మంచివి కావు.
2. పండని బొప్పాయిలో పపైన్, పాలు అనే భాగం ఉంటుంది. బొప్పాయిలో పాలు ఉండటం వల్ల అది శరీరం ప్రోస్టాగ్లాండిన్స్ (Prostaglandins)గా భావించవచ్చు, ఇదే తరచుగా గర్భస్రావానికి దారితీస్తుంది.
ఇది కూడా చదవండి: ఫాస్ట్‌ఫుడ్ అలవాటుందా..? స్పైసీగా ఉంటాయని తెగ లాగించేస్తుంటారా..? పిజ్జాలు, బర్గర్లు కూడా తినే అలవాటుంటే..!
3. పండని బొప్పాయిలో పపైన్ ఉండటం వల్ల గర్భస్థ శిశువుకు మంచిది కాదు. ఇది పిండం చుట్టూ ఉండే పొరను బలహీనపరుస్తుంది.
4. పండిన బొప్పాయి విటమిన్ ఎ, బి, సి, పొటాషియం, బీటా కెరోటిన్ కలిగి ఉంటుంది, ఇది శిశువు నాడీ సంబంధిత అభివృద్ధికి గర్భధారణ సమయంలో ముఖ్యమైనది.
5. బొప్పాయిలోని విటమిన్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి, ఇది వివిధ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
6. బొప్పాయి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. గర్భధారణ సమయంలో సాధారణ మలబద్ధకం సమస్య ఎదుర్కొంటుంది.
7. బొప్పాయి మార్నింగ్ సిక్నెస్‌ను అధిగమించడంలో సహాయపడుతుంది.
8. గర్భధారణ సమయంలో వైరల్ వ్యాధుల చికిత్సకు బొప్పాయిని తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడవచ్చు.