Cancer Test At Home: ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోకుండానే.. కేన్సర్ ఉందని గుర్తించడం ఎలాగంటే..!

ABN , First Publish Date - 2023-09-14T12:00:21+05:30 IST

వక్షోజాలు, ఛాతీ, చనుమొనలపై ఏవైనా అసాధారణ గడ్డలు, ఇతర మార్పులను గమనించినట్లయితే, వైద్యుడి సహాయం తీసుకోండి.

Cancer Test At Home: ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోకుండానే.. కేన్సర్ ఉందని గుర్తించడం ఎలాగంటే..!
symptoms of cancer

శరీరంలో వయసుతో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. కొన్ని పైకి కనిపించే మార్పులు అయితే మరి కొన్ని లోపల లోపలే వచ్చే మార్పులు. అయితే వయసుతో శరీరంలో వస్తున్న మార్పులను, తేడాలను కాస్త ఎప్పటికప్పుడు గమనించడం ఎంతైనా అవసరం అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ప్రాణాంతమైన క్యాన్సర్ లాంటి సమస్యలను చిన్న గమనింపుతో ముందే పసిగట్టే అవకాశం ఉందట. అదెలాగంటే..

క్యాన్సర్ లక్షణాలను తనిఖీ చేసుకోండి.

క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. మెరుగైన చికిత్స అందించడానికి దాని లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. శరీరంలో క్యాన్సర్ ఏర్పడిందని తెలిపే కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఇంట్లో క్యాన్సర్‌ను గుర్తించడానికి, ఈ లక్షణాలపై నిఘా ఉంచడం చాలా ముఖ్యం.

ఎటువంటి సంకేతాలను విస్మరించకూడదు..

క్యాన్సర్ రీసెర్చ్ UK ప్రకారం, క్యాన్సర్ 200 కంటే ఎక్కువ సంకేతాలు, లక్షణాలను చూపుతుంది, కాబట్టి వాటన్నింటినీ గుర్తుంచుకోవడం సాధ్యం కాదు. క్యాన్సర్ కొన్ని సాధారణ లక్షణాలు పసిగట్టడం సులువుగా ఉంటుంది, కానీ మరికొన్ని శరీరం లోపల ఉండవచ్చు.

ప్రతి చిన్న లక్షణాన్ని గమనించండి.

సాధారణం కాని ఏదైనా శరీరక మార్పును గమనించినట్లయితే మీ వైద్యుడికి చెప్పండి. వాస్తవానికి ఇది క్యాన్సర్ కాకపోవచ్చు. కానీ ఆ లక్షణమే అయితే సరైన చికిత్స పొందడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: పొరపాటున కూడా భార్యకు ఓ భర్త చెప్పకూడని 4 విషయాలివీ.. చాణక్య నీతిలో ఏముందంటే..!

వక్షోజాల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.

వక్షోజాలు, ఛాతీ, చనుమొనలపై ఏవైనా అసాధారణ గడ్డలు, ఇతర మార్పులను గమనించినట్లయితే, వైద్యుడి సహాయం తీసుకోండి.


మగవారిలోనూ జాగ్రత్త అవసరమే.

మనవారి వృషణాలు సాధారణంగా ఎలా కనిపిస్తాయో, వాటి పరిమాణం లేదా బరువులో మార్పుల గురించి ఏవైనా మార్పులు సంభవించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

శరీరం ఏదో చెబుతుంది..

శరీరాన్ని పట్టించుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా అసాధారణ గడ్డలు, వాపులు లేదా ఇతర మార్పులను గమనించినట్లయితే వైద్యసహాయం తీసుకోవడంలో ఎలాంటి ఆలస్యం చేయకూడదు.

Updated Date - 2023-09-14T12:00:21+05:30 IST